Model School: ఆదర్శ పాఠశాలల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
Model School: ఆదర్శ పాఠశాలల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
పీపుల్స్ మోటివేషన్, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 164 ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో చేరేందుకు ప్రవే శాలకు ఈనెల 25 నుంచి మార్చి 31వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. ఓసీ, బీసీలు రూ. 150, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.75 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 20వ తేదీన నిర్వహించనున్నారు. ఏ మండలంలో పాఠశాల ఉంటే అక్కడే ఉదయం పదింటి నుంచి 12 గంటల వరకు ఐదో తరగతి స్థాయిలో తెలుగు, ఆంగ్లమాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది. ఏప్రిల్ 27న మెరిట్ జాబితా విడుదల చేస్తారు. ధ్రువపత్రాల పరిశీలన 30న నిర్వహిస్తారు.
ఆన్లైన్లో నమోదు..
ఆదర్శ పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరంలో ఆరో తరగతి ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రకటన జారీ చేశారు. ఈ నెల 24 నుంచి మార్చి 31వ తేదీ వరకు అంతర్జాలంలో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థి అర్హతను పరిశీలించి.. అర్హుడని తేలితే క్రెడిట్, డెబిట్, నెట్ బ్యాంకింగ్ కార్డులు ఉపయోగించి గేట్వే ద్వారా రుసుం చెల్లించిన తరువాత ఒక జనరల్ నెంబర్ కేటాయిస్తారు. ఈ నెంబరు ఆధారంగా www.csw.ap.gov.in లేదా www.apms.ap.gov.in వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇవీ అర్హతలు..
• ఓసీ, బీసీలకు చెందిన విద్యార్థులు 01-09-2013 - 31-08-2015 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01-09-2011 - 31-08-2015 మధ్య జన్మించి ఉండాలి.
• ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.75, ఓసీ, బీసీల వారు రూ.150 రుసుం చెల్లించాలి. ప్రభుత్వం లేక ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాలల్లో నిరవధికంగా 2023-2024, 2024-2025 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదివి ఉండాలి.