National Live Stock Mission: ఉపాధికి ఊతంగా పశుపోషణ.. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం గురించి
National Live Stock Mission: ఉపాధికి ఊతంగా పశుపోషణ.. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం గురించి
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాలు త్మకంగా అమలుచేస్తున్న పశు సంపద పథకం (నేషనల్ లైవ్ స్టాక్ మిషన్) పలువురికి ఉపాధి కల్పిస్తోంది. పశువుల పెంపకంపై ఆసక్తి కలిగినవారి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు కోరు తోంది. గరిష్టంగా రూ. కోటితో చేపట్ట బోయే ఈ పథకం ద్వారా లబ్దిదారులకు రూ.50 లక్షల వరకు రాయితీనీ కేంద్రం అందజేస్తుంది. దరఖాస్తుదారు చెల్లించాల్సిన మొత్తానికి బ్యాంకు గ్యారంటీ ద్వారా రుణం పొందే సౌలభ్యం ఉంటుంది. అర్హతలను బట్టి రూ.30 లక్షల నుంచి రూ.కోటి వరకు యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు.
పథకం అమలు ఇలా..
పశుపోషణతో ఉపాధి కల్పను.. మాంసం, గుడ్లు, ఉన్ని ఉత్పత్తిలో పరిశోధనలకు ప్రోత్సాహం.. నైపుణ్యాలు, సాంకే తిక పరిజ్ఞానం పెంపుతో పాటు ఇందులో రైతు, మహిళా సంఘాలను భాగస్వాములను చేసి వారిని ప్రోత్సహించటం, పశుగ్రాస కొరత లేకుండా ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, విత్తనాల సరఫరా వంటి లక్ష్యాలతో కేంద్రం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. ఆసక్తి గలవారు www.nlm.udyamimitra.in వెబ్సైట్లో దరఖాస్తు చేసు కోవాలి. రాష్ట్రస్థాయి కమిటీ పరిశీలించి, క్షేత్ర పరిశీలన అనంతరం అర్హతలు ఉన్న దరఖాస్తులను కేంద్ర కమిటీకి సిఫార్సు చేస్తారు. అక్కడి నిపుణుల బృందం పరిశీలన అనంతరం నిధులు విడుదలవుతాయి. ఎంపికైన వారు యూనిట్లను నెలకొల్పిన అనంతరం ప్రతినెలా జీపీఎస్. అనుసందాన ఫొటోలను పశుసంవర్ధకశాఖ అధికారులకు పంపించాలి. పథకాన్ని దుర్విని యోగం చేయకుండా లబ్దిదారుల నుంచి గ్యారంటీ బాండ్ తీసుకుంటారు.
ఇవీ అర్హ తలు..
ఈ పథకంలో గొర్రెలు, మేకలు, కోళ్లు, పందుల యూనిట్లు, దాజా, పచ్చిమేత యూని ట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. చదువు, వయసుతో సంబంధం లేకుండా ఆసకి ఉన్న కున్న రంగంలో తప్పనిసరిగా అనుభవంతో పాటు యూనిట్ ఏర్పాటుకు తగినంత భూమి, 50 శాతం బ్యాంకు రుణం అంగీకార పత్రం కలిగి ఉండాలి. ఉదాహరణకు రూ. కోటితో గొర్రెల పెంపకం యూనిట్ ఏర్పాటు కోసం కనీసం ఐదెకరాల సొంత లేదా లీజు భూమి కలిగి ఉండాలి. ఆధార్/ఓటరు గుర్తింపు/పాన్ కార్డు/ డ్రైవింగ్ లైసెన్సు వంటి ఏదైనా గుర్తింపు కార్డు. చిరునామా, పల్ల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు మూడేళ్ల ఆదాయ పన్ను రిటర్నులు, ఆరు నెలల బ్యాంకు స్టేట్మెంట్, భూమి ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం, ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రాజెక్టు, ఖర్చులపై నివేదికతో మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా రూ.కోటితో గొర్రెల యూనిట్ను ప్రారంభిస్తే ఏడాది తరు వాత నెలకు రూ.70 వేల నుంచి రూ. లక్ష ఆదాయం పొందడంతో పాటు ఒక కుటుంబా నికి పూర్తి జీవనోపాధి లభిస్తుంది. అదనపు సమాచారం కోసం జిల్లా పశువైద్య కార్యాలయంలో సంప్రదించాలి.
