Traffic rules: రోడ్డు భద్రతా నియమాలు అనుసరించి వాహనాలు నడపండి...
TrafficRules RoadSafety Awareness WearingHelmet SafetyFirst
Road safety rules
Traffic rules 10 points
Traffic rules in english
Traffic rules chart pdf
By
Peoples Motivation
Traffic rules: రోడ్డు భద్రతా నియమాలు అనుసరించి వాహనాలు నడపండి...
👉 మీ గమ్యస్థానాలను సురక్షితంగా చేరుకోండి ట్రాఫిక్ పోలీసులు
👉రహదారి భద్రత మనందరి భాద్యత...రోడ్డు ప్రమాదాలు నియంత్రణలో ప్రతి వాహనదారుడు పోలీసులకు సహకరించాలి
కేంద్ర మోటార్ వెహికల్ చట్టం మార్చి ఒకటవ తేదీ నుండి అమలులోకి వస్తున్నందున ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ ఉత్తర్వులు మేరకు ట్రాఫిక్ సిఐ వై పాండురంగారావు పెరిగిన ట్రాఫిక్ చలాన్ గురించి ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో తెలియచేసారు. మార్చి 1వ తేదీ నుండి కొత్త చలానాలు అమలులోకి వస్తున్నందున ప్రజలందరూ విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ, తమ వాహనాలకి సంబంధించిన ఉపయోగంలో ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఎవరు కూడా పెరిగిన చలానాల బారిన పడవద్దని, ప్రతి వాహనదారుడు పోలీస్ వారికి సహకరించాలని తెలియపరిచారు. (ఉదాహరణకు గతంలో శిరస్త్రాణo (హెల్మెట్) లేకుండా వాహనాన్ని నడిపినందుకు 135 రూపాయలు ఉండగా, ప్రస్తుతం రూ.1000 రూపాయలు, అదేవిదంగా అన్నిరకాల చలనాలు పెరిగినాయి.) లైసెన్స్, రిజిస్ట్రేషన్, బీమా డాక్యూమెంట్స్ కలిగి ఉండాలని,హెల్మెట్, సీటు బెల్టు ధరించాని, మరియు మద్యం తాగి డ్రైవింగ్ చేయడం చేయకూడదు. వాహనదారులు కేంద్ర మోటార్ వెహికల్ చట్టం గురించి తెలుసుకోవడం మరియు ట్రాఫిక్ నియమాలను పాటించడం చాలా ముఖ్యమని, ఇది రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి మరియు రోడ్డు భద్రతను మెరుగుపరచడానికి సహాయపడుతుందన్నారు. అందరూ కూడా అమెండ్మెంట్ అయిన వాహన చట్టాన్ని గౌరవిస్తూ, అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ, జరిమానాల బారిన పడకుండా ఉండాలని ప్రకాశం జిల్లా పోలీసులు ప్రజలను కోరడమైనది. ఈ మీడియా సమావేశంలో ట్రాఫిక్ ఎస్ఐలు డి. శ్రీనివాసరావు, నజీర్ భాష, మాల్యాద్రి, అస్లాం మరియు సిబ్బంది ఉన్నారు.
Comments