భార్య పై హత్యాయత్నం కేసులో ముద్దాయికి 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు 5 వేల జరిమానా..
భార్య పై హత్యాయత్నం కేసులో ముద్దాయికి 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు 5 వేల జరిమానా..
సంచలన తీర్పు వెలువరించిన అనంతపురం జిల్లా 4 వ జిల్లా (మహిళా కోర్టు) న్యాయమూర్తి M శోభారాణి
ప్రాసిక్యూషన్ తరపున బలమైన వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుజన
పుట్టపర్తి మండలం వెంకటగారి పల్లి కి చెందిన చాకలి గాయత్రి పై జరిగిన వేదింపులు మరియు హత్యాయత్నం కేసులో , ముద్దాయి అయిన భర్త చాకలి రాజశేఖర్ వయస్సు 38 సంవత్సరాలు s/o కిష్టాప్ప , పొడరాళ్ళ పల్లి గ్రామం, ముదిగుబ్బ మండలం కు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు 5 వేల రూపాయల జరిమానా విధిస్తూ అనంతపురం జిల్లా 4 వ జిల్లా (మహిళా కోర్టు) న్యాయమూర్తి M శోభారాణి సోమవారం సంచలన తీర్పు చెప్పారు.
కేసు పూర్వాపరాల్లోకి వెళితే, పుట్టపర్తి మండలం వెంకట గారి పల్లి గ్రామానికి చెందిన చాకలి సావిత్రి ను ముదిగుబ్బ మండలం కరావులపల్లి తండా గ్రామస్తుడైన చాకలి రాజశేఖర్ తో 2016 సంవత్సరంలో పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత రాజశేఖర్ సావిత్రి ఇద్దరు ముదిగుబ్బలో కాపురం ఉండినారు. ఆరు నెలల తర్వాత రాజశేఖర్ ఫిర్యాదిపై అనుమానం పెంచుకొని ఎప్పుడు తిట్టి కొట్టి చంపుతాననిని బెదిరించి వేధించేవాడు తర్వాత ఫిర్యాది అయిన సావిత్రి అతను పెట్టే వేధింపులు భరించలేక వెంకట గారి పల్లిలో వాళ్ల పుట్టింటికి వచ్చి ఇక్కడే ఉంటుంది అయినా కూడా ముద్దాయి నాలుగైదు సార్లు ఫిర్యాదుకి పుట్టింటికి వచ్చి ఇక్కడ తిట్టి కొట్టి చంపుతానని బెదిరించిన పోయేవాడు. ఒకసారి వచ్చి ఇక్కడ తిట్టి కొట్టి బెదిరించి ఫిర్యాది మామ అయిన ఓబులేసు యొక్క ఫోన్ తీసుకొని వెళ్లిపోయాడు తర్వాత 11-10-2017 తారీకు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో రాజశేఖర్ ఫిర్యాదికి ఫోన్ చేసి నేను అరటికాయ లోడు వేసుకొని డ్రైవింగ్ పని మీద పోతున్నాను నువ్వు వెంకట్ గారి పల్లి క్రాసులోకి వస్తే మీ మామ సెల్ ఫోన్ నీకు ఇస్తాను అని చెప్పడంతో ఫిర్యాది వాళ్ళ అమ్మ కు విషయం చెప్పి ఫిర్యాదుకు తోడుగా వాళ్ళ అక్క కొడుకు అయిన సాయి కృష్ణ , అతని స్నేహితుడు సాయికుమార్ మరియు ఫిర్యాదు బావ రాములను తోడు తీసుకొని సాయంత్రం 4:30 గంటల సమయంలో వెంకట గారి పల్లి క్రాస్ కు పోతూ ఉండగా అప్పటికే వంక దగ్గర కంపచెట్లలో నక్కి ఉన్న ముద్దాయి పరిగెత్తుకుంటూ వచ్చి నిన్ను చంపితే ఇప్పుడు నీకు దిక్కెవరు లంజా అని కత్తితో ఫిర్యాది ఎడమ భుజం వెనుక కుడిపక్క గొంతు కింద రెండు పోట్లు పొడవగా అంతలో ఫిర్యాది వెనకాల వస్తున్న సాయి కృష్ణ సాయికుమార్, రాము లను చూసి పారిపోయాడు. అప్పుడే అటువైపు వస్తున్న వెంకట గారి పల్లి గ్రామ సర్పంచ్ చిన్న రామప్ప అది చూసి 108 అంబులెన్స్ కి ఫోన్ చేసి గాయపడిన సావిత్రి ని పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకొని పోయి వైద్యం చేసుకుని మరుసటి రోజు అనగా 12-10-2017వ తేదీన ఫిర్యాది పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేసింది. ఈ కేసులో అప్పటి పుట్టపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ ASI ధనుంజయ సెక్షన్ 498-A,307 IPC క్రింద FIR No. 70/2017 గా నమోదు చేయగా, అప్పటి సబ్- ఇన్స్పెక్టర్ అయిన శాంతిలాల్ , సమగ్ర దర్యాప్తు జరిపి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కేసు ఋజువు కావడంతో ముద్దాయి చాకలి రాజశేఖర్ కు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు 5 వేల జరిమానా విధిస్తూ, సోమవారం అనంతపురం జిల్లా 4 వ జిల్లా (మహిళా కోర్టు) న్యాయమూర్తి M. శోభారాణి SC No 220/2019* కింద తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ తరపున సుజన బలమైన వాదనలు వినిపించారు.
ఈ కేసులో సమగ్రమైన దర్యాప్తు జరిపిన IO లు ,ASI ధనుంజయ, అప్పటి సబ్- ఇన్స్పెక్టర్ అయిన శాంతిలాల్, ట్రయల్ సకాలం లో జరగటం జరగటానికి సహకరించిన పుట్టపర్తి రూరల్ PS ఎస్‌ఐ KM లింగన్న మరియు సాక్షులను తీసుకు రావడంలో హెడ్ కానిస్టేబుల్ లు డి శివ మరియు మనోహర్, మరియు కోర్టులైజన్ ఆఫీసర్ అగు ఏఎస్ఐ శ్రీనివాసులు తదితరులు బాగా సహకరించారు. వీరందరిని శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ వి రత్న అభినందించారు.