Banks: రాష్ట్రంలోని మూడు గ్రామీణ బ్యాంకులు కనుమరుగు
Banks: రాష్ట్రంలోని మూడు గ్రామీణ బ్యాంకులు కనుమరుగు?
సప్తగిరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి బ్యాంకులు..
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో విలీనం..
కేంద్ర ప్రభుత్వం మరోసారి బ్యాంకుల విలీనానికి తెర లేపింది. ఈసారి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను విలీనం చేస్తోంది. ఒకే రాష్ట్రం, ఒకే గ్రామీణ బ్యాంక్ అనే నినాదంతో ఈ విలీన ప్రక్రియను చేపడుతుతోంది. బ్యాంకుల విలీనంతో ఆంధ్రప్రదేశ్ లోని మూడు గ్రామీణ బ్యాంకులు అదృశ్యం కానున్నాయి. ప్రస్తుతం కెనరా బ్యాంకు ఆధీనంలోని గ్రామీణ వికాస్ బ్యాంకులోకి ప్రస్తుత మూడు గ్రామీణ బ్యాంకులూ విలీనం కానున్నాయి. ఇక ఈ మూడు గ్రామీణ బ్యాంకుల ఖాతాదారులు ఇకపై గ్రామీణ వికాస్ బ్యాంకు ఖాతాదారులుగా తమ ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో మిగతా 3 బ్యాంకులు విలీనమవుతాయి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ పేరిట అకౌంట్ కొనసాగుతుంది. మిగిలిన సేవలన్నీ కొనసాగుతాయి. ఈ విలీనానికి కసరత్తు దాదాపు పూర్తి అయ్యింది. కేంద్ర ఆర్థిక మంత్రి ఆమోదం ఒక్కటే మిగిలింది. ఒకటి, రెండు నెలల్లో విలీన ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తుల వారికి రుణాలు, ఇతర సౌకర్యాలను అందించే లక్ష్యంతో అర్ ఆర్ బి చట్టం, 1976 కింద గ్రామీణ బ్యాంకులను ఏర్పాటు చేశారు.