Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
కడప, మార్చి 20 (పీపుల్స్ మోటివేషన్):-
ఆర్మీ డైరెక్టర్ రిక్రూట్మెంట్ గుంటూరు వారి ఆధ్వర్యంలో అగ్నిపథ్ స్కీం కింద అగ్ని వీర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్టెప్స్ సీఈవో సాయి గ్రేస్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
అగ్నివీర్ లోని వివిధ కేటగిరీలైన - “అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్
ఆఫీస్ అసిస్టెంట్/ స్టోర్ కీపర్, అగ్నివీర్ టెక్నికల్, ట్రేడ్స్ మెన్" నందు నియామకాల కోసం ఆన్లైన్ www.joinindianarmy.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ సంవత్సరం మొట్ట మొదటిసారిగా ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (CEE ) ను తెలుగు నందు నిర్వహిస్తున్నారన్నారు. NCC - 'A' 'B' & 'C' సర్టిఫికేట్ గల అభ్యర్ధులకు ప్రతిభావంతులైన క్రీడాకారులకు, అగ్నివీర్ టెక్నికల్ కేటగిరీ అభ్యర్థులకు ఐ.టి.ఐ. డిప్లొమా వారికి అదనపు మార్కులు జతచేస్తారని తెలిపారు. అర్హత గల అభ్యర్థులు 10.04.2025వ తేదీ లోగా పైన తెలిపిన వెబ్ సైట్ నందు నమోదు చేసుకోవాలని ఆమె తెలిపారు.