కర్నూలు నగరంలో కాశపోగు సంజన్న హత్య కేసులో 5 మంది ముద్దాయిలు అరెస్టు...
కర్నూలు నగరంలో కాశపోగు సంజన్న హత్య కేసులో 5 మంది ముద్దాయిలు అరెస్టు...
• హత్య కేసుకు ఉపయోగించిన ఆయుధాలు, కార్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం..
• రౌడీ షీటర్ల పై నిఘా పెంచాం..
• రెండు కుటుంబాల మద్య గొడవలే ఈ హత్యకు కారణం..
-కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు జిల్లా, (పీపుల్స్ మోటివేషన్):-
కర్నూలు పట్టణంలో ఈనెల 14వ తేదీ శరీన్ నగర్ లో జరిగిన కాశపోగు సంజన్న హత్య కేసులో ఐదుగురు నిందితులను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంధర్బంగా కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో విలేకరుల సమావేశం నిర్వహించి నిందితుల వివరాలు వెల్లడించారు.
ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ..
రెండు కుటుంబాల మధ్య తరచూ ఘర్షణలు జరిగాయన్నారు. హత్య కేసులోని నిందితులను ప్రాథమికంగా అరెస్ట్ చేశాం,మిగితా ఆధారాలు సేకరించి ఎవరైనా ఉంటే వారిని కూడా అరెస్ట్ చేస్తామన్నారు. ప్రతి ఆదివారం క్రైమ్ హిస్టరీ ఉన్న వారిని పోలీసు స్టేషన్లకు పిలిపించి విచారిస్తున్నామన్నారు. రౌడీ షీటర్ల పై నిఘా పెంచామన్నారు.
జరిగిన విషయం...
14.03.2025 వ తేదీన రాత్రి సుమారు 09.30 గంటల ప్రాంతంలో కర్నూల్ టౌన్ శరీన్ నగర్ , అల్లి పీర వీర స్వామి భజన మందిరంలో భజన ముగించుకొని బయటకు వస్తున్న కాశపోగు సంజన్న( వయస్సు, 60 సంవత్సరాలు, S/O K.రాజన్న) పై అదే ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ వడ్డె ఆంజనేయులు అతని కుమారులు, అనుచరులు మరియు మరి కొంతమంది కత్తులు, పిడిబాకులు, కోడవాళ్ళతో దాడి చేసి చంపినారు.
• కాశపోగు సంజన్న ( 30 వ వార్డు కార్పోరేటర్ జయరాముడు యొక్క తండ్రి) తెలుగు దేశం పార్టీ నాయకుడు.
• జయరాముడు ఫిర్యాదు పై కర్నూల్ నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 95/ 2025 నందు వడ్డే ఆంజనేయులు @ ఆంజి అతని ముగ్గురు కుమారులు, అతని భార్య మరియు కొంతమందిపై దాడి హత్య మరియు ఎస్సీ ఎస్టీ అత్యాచారాలు చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు అధికారిగా మహిళా పిఎస్ డిఎస్పి కె. శ్రీనివాస చారి కి అప్పగించడమైనది.
• దర్యాప్తులో సాంకేతిక ఉపకరణాలను ఉపయోగించుకొని, ముద్దాయిల కదలికలు మరియు వారు వాడిన వాహనాలను సీసీటీవీ ల ద్వారా కనుగొని, ఈ శుక్రవారం రోజు అనగా 21.03.2025 వ తేదీ 07.30 గంటలకు కాదాంబరి టౌన్ షిప్ వద్ద నిర్జన ప్రదేశంలో
1) వడ్డే ఆంజనేయులు (52)
అతని ముగ్గురు కొడుకులు
2) వడ్డే శివ కుమార్ (20)
3) వడ్డే తులసి (23)
4) రేవంత్ (22)
5) (వారి అనుచరుడు) మాల అశోక్(30) లను అరెస్టు చేయడమైనది,
వీరందరిది కర్నూలు టౌన్, శరీన్ నగర్.
వారి వద్ద నుండి హత్యకు వాడిన వేట కొడవళ్ళు, పిడిబాకు, రక్తపు మరకలు గల బట్టలు, సెల్ ఫోన్లు, కర్రలు హత్యా సమయంలో వాడిన కార్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది.
ముద్దాయిలను సత్వరముగా కోర్టు ముందు హాజరు పరిచి, విచారణ వేగవంతం చేసి కఠినముగా శిక్ష పడేటట్లు చేయవలెనని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులను ఆదేశించారు.
పై హత్యకు వడ్డే ఆంజనేయులు మరియు మృతుడు సంజన్న కుటుంబ సభ్యులు మధ్య ఉన్న వారి పాత కక్షలు, వార్డులో ఆధిపత్య పోరు కారణమైనట్లుగా దర్యాప్తులో వెలుగు చూసిందన్నారు.
పై కేసులో చాకచక్యంతో వేగంగా కేసును చేధించి త్వరగా ముద్దాయిలను అరెస్టు చేసిన దర్యాప్తు అధికారి D.S.P మహిళా పోలీస్ స్టేషన్ కె.శ్రీనివాసచారి ని, కర్నూల్ SDPO, జె. బాబు ప్రసాద్ ని మరియు కర్నూల్ నాల్గవ పట్టణ సీఐ మధుసూదన్ గౌడ్, కర్నూల్ 3 టౌన్ సిఐ శేషయ్య, కర్నూల్ రూరల్ సీఐ చంద్రబాబు నాయుడు, కర్నూల్ తాలూకా యుపిఎస్ సీఐ శ్రీధర్, కోడుమూరు CI తబ్రేజ్ మరియు సైబర్ సెల్ సీఐ ఎస్ వేణుగోపాల్ తో పాటు ఎస్. ఐ లను మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించినారు.