రోడ్డు భద్రతా నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యాలు చేరండి
General News telugu latest news telugu intresting news telugu intresting facts
Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
By
Peoples Motivation
రోడ్డు భద్రతా నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యాలు చేరండి
నంబరు ప్లేట్లు లేని 60 ద్విచక్ర వాహనాలు స్వాధీనం..
నంబరు ప్లేట్లు అమర్చుకుని తీసుకెళ్లాలని సూచనలు చేసిన పోలీసులు..
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అనంతపురం రూరల్ డిఎస్పి ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం రోడ్డు మరియు కదిరి జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీలు..
ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యాలు చేరుకోవాలని అనంతపురం రూరల్ డిఎస్పి టి వెంకటేశ్వర్లు సూచించారు. జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు రూరల్ డిఎస్పి ఆధ్వర్యంలో అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కళ్యాణదుర్గం రోడ్ లోనూ మరియు ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆకుతోటపల్లి వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహించారు. హరహదారుల గుండా వచ్చి వెళ్లే టూ వీలర్లు, ఫోర్ వీలర్లను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ముఖ్యంగా నంబర్ ప్లేట్లు లేని 60 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నంబర్ ప్లేట్లు అమర్చుకొని తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం వాహనదారులతో డిఎస్పి మాట్లాడారు. ప్రతి టూ వీలర్ వాహన చోదకుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. సెల్ఫోన్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ లకు దూరంగా ఉండాలన్నారు. త్రిబుల్ రైడింగ్ కు స్వస్తి పలకాలన్నారు. అతివేగంగా ప్రయాణించడం కూడా ప్రమాదకరమైనదేనని సూచించారు. అంతేకాకుండా... ఆటోలు పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తే చట్టపరంగా రోడ్ సేఫ్టీ ఉల్లంఘనలపై చర్యలు తీసుకుంటామన్నారు. డీఎస్పీ తో పాటు అనంతపురం రూరల్ సిఐ ఎస్ఐలు శేఖర్, హేమంత్ కుమార్, రాంబాబు, విజయ్ కుమార్, తదితరులు ఉన్నారు.
Comments