రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

AGNIVEER NOTIFICATION: పది, ఇంటర్ చదివిన వారికి గుడ్‌న్యూస్‌.. ఈ నోటిఫికేషన్‌ మీ కోసమే

Agniveer Army Recruitment 2025 Apply Online Agniveer Recruitment 2025 official website Join Indian Army Indian Army Recruitment 2025 Apply Online Date
Peoples Motivation

AGNIVEER NOTIFICATION: పది, ఇంటర్ చదివిన వారికి గుడ్‌న్యూస్‌.. ఈ నోటిఫికేషన్‌ మీ కోసమే 

• దేశవ్యాప్తంగా అగ్నివీర్‌ నియామకాలకు ప్రకటనలు విడుదల.. 

• పరీక్షలు, ఫిజికల్‌ టెస్టుల ద్వారా అభ్యర్థుల ఎంపిక పూర్తి సమాచారం..

Agniveer Army Recruitment 2025 Apply Online Agniveer Recruitment 2025 official website Join Indian Army Indian Army Recruitment 2025 Apply Online Date Indian Army Agniveer Recruitment 2025 apply Online date

దేశ సేవ కోసం ఇండియన్‌ ఆర్మీలో చేరాలని ఉందా? అయితే ఇప్పుడో అవకాశం వచ్చింది! దేశవ్యాప్తంగా అగ్నివీర్‌ నియామకాలకు ప్రకటనలు విడుదలయ్యాయి. కొన్ని ఉద్యోగాలకు ఎనిమిదో తరగతి విద్యార్హతతోనూ పోటీ పడవచ్చు. పరీక్ష, ఫిజికల్‌ టెస్టులతో నియామకాలుంటాయి. అవకాశం వచ్చినవారు శిక్షణతో కలిపి నాలుగేళ్లు ఆర్మీలో సేవలు అందించవచ్చు. ఆ తర్వాత వీరిలో 25 శాతం మందిని శాశ్వత ఉద్యోగంలోకి తీసుకుంటారు. మిగిలినవారికి ఆర్థిక ప్రోత్సాహకం, స్కిల్‌ సర్టిఫికెట్‌ అందుతాయి.

రెండు తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌ అభ్యర్థులకు గుంటూరు, విశాఖపట్నం, అలాగే తెలంగాణ వారికి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ఆఫీస్, సికింద్రాబాద్‌లో నియామక కేంద్రాల ఆధ్వర్యంలో పరీక్షలు, ఫిజికల్‌ టెస్టులు నిర్వహిస్తారు. ముందు ఆన్‌లైన్‌లో పరీక్ష ఉంటుంది. ఇందులో ప్రతిభావంతులకు ఫిజికల్‌ టెస్టులు నిర్వహిస్తారు. తాజా నోటిఫికేషన్‌ ద్వారా అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ, అగ్నివీర్‌ టెక్నికల్, అగ్నివీర్‌ క్లర్క్‌/ స్టోర్‌ కీపర్‌ టెక్నికల్, అగ్నివీర్‌ ట్రేడ్స్‌మెన్‌ పోస్టులను భర్తీ చేస్తారు.

పోస్టులు, అర్హతలు

అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ (Agniveer General duty):

పదో తరగతిలో కనీసం 45 శాతం మార్కులు అవసరం. అలాగే ప్రతి సబ్జెక్టులోనూ 33 శాతం పొందాలి. లైట్‌ మోటార్‌ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్నవారికి డ్రైవర్‌ పోస్టులకు ప్రాధాన్యమిస్తారు. ఎత్తు 166 సెం.మీ. ఉండాలి.

అగ్నివీర్‌ టెక్నికల్‌ (Agniveer technical): 

మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణులు అర్హులు. ప్రతి సబ్జెక్టులోనూ 40 శాతం, మొత్తం మీద 50 శాతం మార్కులు పొందాలి. లేదా పదో తరగతిలో ప్రతి సబ్జెక్టులోనూ 40 శాతం, మొత్తం మీద 50 శాతం మార్కులతో పాటు నిర్దేశిత ట్రేడ్‌/బ్రాంచీల్లో రెండేళ్ల ఐటీఐ లేదా మూడేళ్ల డిప్లొమా కోర్సు ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎత్తు 165 సెం.మీ. ఉండాలి.

అగ్నివీర్‌ క్లర్క్, స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌ (Agniveer Clerk, Store keeper tecnical): 

ఏ గ్రూపుతోనైనా ఇంటర్‌లో 60 శాతం మార్కులు పొందినవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ప్రతి సబ్జెక్టులోనూ కనీసం 50 శాతం మార్కులు రావాలి. ఇంగ్లిష్, మ్యాథ్స్‌/ అకౌంట్స్‌/ బుక్‌ కీపింగ్‌లో 50 శాతం తప్పనిసరి. ఎత్తు 162 సెం.మీ. ఉండాలి.

అగ్నివీర్‌ ట్రేడ్స్‌మెన్‌ (Agniveer Tradesmen): 

పదో తరగతిలో ఉత్తీర్ణులైతే చాలు. ప్రతి సబ్జెక్టులోనూ 33 శాతం మార్కులు ఉండాలి. ఎత్తు 166 సెం.మీ. అవసరం.

అగ్నివీర్‌ ట్రేడ్స్‌మెన్‌ (Agniveer Tradesmen): 

ఎనిమిదో తరగతి పూర్తయితే సరిపోతుంది. ప్రతి సబ్జెక్టులోనూ 33 శాతం మార్కులు తప్పనిసరి. ఎత్తు 166 సెం.మీ. ఉండాలి.

వయసు (Age):

అన్ని పోస్టులకూ కనిష్ఠంగా 17 1/2 గరిష్ఠంగా 21 ఏళ్లలోపు ఉండాలి. అక్టోబరు 1, 2004 - ఏప్రిల్‌ 1, 2008 మధ్య జన్మించినవారు అర్హులు. అన్ని పోస్టులకు ఎత్తుకు తగ్గ బరువు అవసరం. ఛాతీ విస్తీర్ణం 77 సెం.మీ. ఉండాలి. సర్వీస్‌మెన్, ఎక్స్‌ సర్వీస్‌మెన్, వార్‌ విడో పిల్లలకు మినహాయింపులు వర్తిస్తాయి.

పరీక్ష విధానం ఇలా (Exam Process): 

దరఖాస్తు చేసుకున్న పోస్టు ప్రకారం ప్రశ్నపత్రం ఉంటుంది. ఎక్కువ విభాగాలకు జనరల్‌ నాలెడ్జ్, జనరల్‌ సైన్స్, మ్యాథ్స్, లాజికల్‌ రీజనింగ్‌ విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. కొన్ని పోస్టులకు కంప్యూటర్‌ సైన్స్, జనరల్‌ ఇంగ్లిష్, లాజికల్‌ రీజనింగ్, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీల్లోనూ ప్రశ్నలుంటాయి. పరీక్ష కోసం తెలుగు మాధ్యమాన్నీ ఎంచుకోవచ్చు. సాధారణంగా 50 ప్రశ్నలు వస్తాయి. వీటిని ఒక గంటలో పూర్తిచేయాలి. కొన్ని పోస్టులకు మాత్రం 100 ప్రశ్నలు, 2 గంటల వ్యవధితో పరీక్ష ఉండొచ్చు.

ఇండియన్‌ ఆర్మీ వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్‌ టెస్టు అందుబాటులో ఉంచారు. దాన్ని రాసి, పరీక్షపై అవగాహన పెంచుకోవచ్చు. క్లర్క్, స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌ పోస్టులకు టైప్‌ పరీక్ష అదనం. నిమిషానికి 30 ఆంగ్ల పదాలు టైప్‌ చేయగలగాలి.

బోనస్‌ మార్కులు వారికి మాత్రమే:

• ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ పిల్లలకు 20 ఉంటాయి.

• క్రీడల్లో రాణించినవారికి స్థాయిని బట్టి గరిష్ఠంగా 20 మార్కులు కేటాయించారు.

• ఎన్‌సీసీ ఏ ఉంటే 5, బీతో 10, సీ ఉంటే 20, సీతోపాటు రిపబ్లిక్‌ డే పరేడ్‌లో పాల్గొంటే గరిష్ఠంగా 25 మార్కులు దక్కుతాయి.

• పది తర్వాత రెండేళ్ల ఐటీఐకి 20, రెండు లేదా మూడేళ్ల డిప్లొమాకి 30 మార్కులు

• ఇంటర్‌ తర్వాత ఏడాది ఐటీఐకి 30, రెండేళ్లదైతే 40 మార్కులు.

• ఇంటర్‌ తర్వాత డిప్లొమా చేస్తే 50 మార్కులు.

• ఈ బోనస్‌ మార్కులు గరిష్ఠంగా టెక్నికల్‌ పోస్టులైతే 50, మిగిలినవాటికి 25 కలుపుతారు.

• వీటిని పరీక్షలో సాధించిన మార్కులకు జతచేసి మెరిట్‌ లిస్టు రూపొందిస్తారు. అర్హులకు ఫిజికల్‌ టెస్టులు నిర్వహిస్తారు.

ఫిజికల్‌ టెస్టులు: 

అన్ని పోస్టులకూ ఫిజికల్‌ టెస్టులో అర్హత సాధించడం తప్పనిసరి. ఇందులో భాగంగా 1.6 కి.మీ. దూరాన్ని 5 నిమిషాల 30 సెకన్లలో పూర్తిచేస్తే 60 మార్కులు, 5 నిమిషాల 31 సెకన్ల నుంచి 5 నిమిషాల 45 సెకన్ల లోపు పూర్తిచేస్తే 48 మార్కులు ఇస్తారు. 6 నిమిషాల్లోపు చేరుకుంటే 36, 6 నిమిషాల 15 సెకెన్లలోపు అయితే 24 మార్కులు పొందుతారు. కనీసం 6 పుల్‌అప్స్‌ తప్పనిసరి. 6 తీసినవారికి 16, 7 తీస్తే 21, 8కి 27, 9కి 33, 10 తీస్తే 40 మార్కులు పొందవచ్చు. 9 అడుగుల దూరానికి దూకగలిగితే అర్హత సాధిస్తారు. జిగ్‌జాగ్‌ బ్యాలెన్స్‌లో అర్హత సాధించాలి. అనంతరం ఫిజికల్‌ మెజర్‌మెంట్, అడాప్టబిలిటీ, మెడికల్‌ టెస్టులు ఉంటాయి. వీటన్నింటిలో విజయవంతమైతే శిక్షణకు ఎంపిక చేస్తారు.

జీతం, సేవానిధి : 

మొదటి సంవత్సరం ప్రతి నెలా రూ.30,000 రెండో ఏడాది రూ.33,000 మూడో సంవత్సరం రూ.36,500 నాలుగో ఏట రూ.40,000 చెల్లిస్తారు. ప్రతి నెలా అందుకునే మొత్తంలో 30 శాతం కార్పస్‌ ఫండ్‌కి జమ చేస్తారు. నాలుగేళ్ల వ్యవధికి గానూ సేవానిధిలో రూ.5.02 లక్షలు అగ్నివీరుని నుంచి పోగవుతుంది. అంతే మొత్తాన్ని ప్రభుత్వమూ జమ చేస్తుంది. రెండూ కలిసి రూ.10.04 లక్షలవుతాయి. దీనికి వడ్డీ జతచేసి అగ్నివీరునికి అందిస్తారు.

ఇవి వర్తించవు: 

వీరికి పింఛను, గ్రాట్యుటీ వర్తించవు. ఎక్స్‌ సర్వీస్‌మెన్‌గానూ పరిగణించరు. కరవు భత్యం, మిలటరీ సర్వీస్‌ పే (ఎంఎస్‌పీ), ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) సైతం ఉండదు.

మధ్యలో మానేస్తే:

అగ్నివీరులు నాలుగేళ్లలోపే కావాలంటే వైదొలగొచ్చు. అలాంటి సందర్భంలో అగ్నివీరుని వేతనం నుంచి జమ అయిన మొత్తాన్నే చేతికి అందిస్తారు. ప్రభుత్వ ఆర్థిక ప్రోత్సాహం దక్కదు.

ఇవి వర్తింపు: 

వార్షిక సెలవులు 30 ఉంటాయి. ఆరోగ్య సమస్యను బట్టి సిక్‌ లీవ్‌ కేటాయిస్తారు. నాలుగేళ్ల సర్వీస్‌లో ఉన్నప్పుడు రిస్క్‌ అండ్‌ హార్డ్‌షిప్, రేషన్, డ్రెస్, ట్రావెల్‌ అలవెన్సులు మాత్రం అందిస్తారు. నాలుగేళ్లపాటు రూ.48 లక్షలకు లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ కవర్‌ వర్తిస్తుంది. నాలుగేళ్ల సేవలకు గానూ వీరికి అగ్నివీర్‌ స్కిల్‌ సర్టిఫికెట్‌ అందుతుంది. సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌/ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ నిమిత్తం బ్యాంకుల నుంచి రుణాలూ మంజూరయ్యేలా ఏర్పాట్లు చేస్తారు.

గరిష్ఠంగా 25 శాతం మందిని ఆర్మీలోకి: 

నాలుగేళ్ల వ్యవధి పూర్తిచేసుకున్న అగ్నివీరుల ఒక్కో బ్యాచ్‌ నుంచి గరిష్ఠంగా 25 శాతం మందిని ఆర్మీలో శాశ్వత ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఇందుకోసం ఆర్మీ అవసరాలు, నాలుగేళ్ల వ్యవధిలో చూపిన ప్రతిభను ప్రామాణికంగా తీసుకుంటారు. ఇలా ఎంపికైనవారు 15 ఏళ్లు విధుల్లో కొనసాగవచ్చు.

ముఖ్య సమాచారం (Important Information)

• ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు : ఏప్రిల్‌ 10.

• అప్లికేషన్ ఫీజు : రూ.250

• ఆన్‌లైన్‌ పరీక్షలు : జూన్‌లో.

• అధికారిక వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in/

Comments

-Advertisement-