RAJIV YUVA VIKASAM: రాజీవ్ యువవికాసం పథకానికి ఇలా అప్లై చేసుకోండి..
RAJIV YUVA VIKASAM: రాజీవ్ యువవికాసం పథకానికి ఇలా అప్లై చేసుకోండి..
• ప్రారంభమైన రాజీవ్ యువవికాసం పథకం దరఖాస్తుల స్వీకరణ..
• దరఖాస్తు విధానం.. చివరితేదీ తదితర వివరాలు మీ కోసం..
తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతకు రాజీవ్ యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేసేందుకు సోమవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈ మేరకు యువవికాసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. స్వయం ఉపాధి పథకాలు అమలు చేసేందుకు ఇప్పటికే సంక్షేమశాఖలు రూపొందించినటువంటి కార్యాచరణ ప్రణాళికలకు సర్కారు ఆమోదం తెలిపింది. అసలేంటి ఈ పథకం? ఏవిధంగా అప్లై చేసుకోవాలి? చివరి తేదీ వంటి పూర్తి విషయాలను తెలుసుకుందాం..
అసలు ఈ రాజీవ్ యువ వికాసం ఎవరి కోసం?:-
‘రాజీవ్ యువ వికాసం’ పథకంలో భాగంగా బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుంది. యువ వికాసం పథకానికి ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఏప్రిల్ 6 నుంచి మే 30 వరకు లబ్ధిదారుల ఎంపిక, యూనిట్ల కేటాయింపు ప్రక్రియ ఉంటుంది.
కేటగిరి-1 కింద రూ.లక్ష వరకు రుణం 80 శాతం రాయితీ
కేటగిరీ-2 కింద రూ.2 లక్షల వరకు సాయం 70 శాతం రాయితీ
కేటగిరీ-3 కింద రూ.3 లక్షల వరకు సాయం.. 60 శాతం రాయితీ
దరఖాస్తు చేయు విధానం:-
రాజీవ్ యువవికాసం పథకానికి అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. ఏప్రిల్ 5తో ముగుస్తుంది. అందువల్ల ముందుగానే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం.
ఈ కింది విధంగా రాజీవ్ యువవికాసం దరఖాస్తు చేసుకోవచ్చు:-
• ముందుగా https://tgobmms.cgg.gov.in/ వెబ్సైట్ను సందర్శించండి.
• రాజీవ్ యువవికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
• ఇప్పుడు మీకు అప్లికేషన్ ఫాం అనే అప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
• వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన ఆప్షన్లు కనిపిస్తాయి.
• మీరు ఒక వేళ ఎస్సీలు విభాగానికి చెందినవారైతే ఎస్సీకార్పొరేషన్ లింక్పై క్లిక్ చేయండి,
• ఒక వేళ మీరు బీసీలు అయినట్లయితే బీసీ కార్పొరేషన్పై క్లిక్ చేయండి
• ఈ విధంగా మీరు ఏ కార్పొరేషన్కు చెందుతారో వాటి ఆధారంగా ఆప్షన్ను ఎంచుకోవాలి
• ఇప్పుడు బెనిఫీషియరీ రిజిస్ట్రేషన్ ఫాం అనే ఆప్షన్ కనిపిస్తుంది
• ఈ విభాగంలో మీ ఆధార్ కార్డు ప్రకారం మీ పేరు ఎంటర్ చేయండి.
• మీ ఆధార్ కార్డ్ నంబర్ కూడా ఎంటర్ చేయాలి.
• రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి.
• బెనిఫిషియరీ టైప్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి.
• ఆర్థిక సహాయం రకం, స్కీమ్ రకం అనే ఆప్షన్లు కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
• ఈ విధంగా నింపిన తర్వాత యూనిట్ల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి అనే ఆప్షన్ కనిపిస్తుంది.
ఇలా అప్లికేషన్ను మొత్తాన్ని నింపాల్సి ఉంటుంది. అన్ని వివరాలు సరిగా ఎంటర్ చేశారో లేదో సరిచూసుకుని అప్లికేషన్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.