రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

AP DSC: ఎట్టిపరిస్థితుల్లో మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్

Ap dsc notification AP DSC 2025 AP DSC official website AP DSC apply online 2025 AP DSC latest News Today https://cse.ap.gov.in/ cse.ap.gov.in AP TET
Peoples Motivation

AP DSC: ఎట్టిపరిస్థితుల్లో మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్

• వర్గీకరణపై త్వరలోనే వన్ మ్యాన్ కమిషన్ నివేదిక!

• వైసీపీ హయాంలో ఒక్క టీచర్ పోస్టునూ భర్తీ చేయలేదు

• టీడీపీ పాలనలోనే 70 శాతం ఉపాధ్యాయ నియామకాలు

• మండలిలో సభ్యుల ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం

Ap dsc notification AP DSC 2025 AP DSC official website AP DSC apply online 2025 AP DSC latest News Today https://cse.ap.gov.in/ cse.ap.gov.in AP TET

అమరావతి, (పీపుల్స్ మోటివేషన్):- ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్ పై మండలిలో వైసీపీ సభ్యుల ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువకులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. వారందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా డీఎస్సీ నిర్వహించలేదు. ఒక్క టీచర్ పోస్టునూ భర్తీ చేయలేదు. దీనిపై వైసీపీ సమాధానం చెప్పాలి. ఉపాధ్యాయ నియామకాల్లో 1994 నుంచి చూస్తే.. 2,60,194 పోస్టులు భర్తీ చేశారు. అందులో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 1,80,272 పోస్టులు భర్తీ చేయడం జరిగింది. ఒక్క టీడీపీ హయాంలోనే 70శాతం టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది. నేను మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు డీఎస్పీ ఫైల్ పైనే మొదటి సంతకం చేయడం జరిగింది. అందులో భాగంగానే 02-07-24 తేదీన టెట్ నిర్వహించడం జరిగింది. 4.27 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 3.68 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. 1.87 లక్షల మంది అర్హత సాధించారు. 03-10-24 నుంచి 21-10-24 వరకు టెట్ పరీక్షను పూర్తిచేయడం జరిగింది. వర్గీకరణపై వన్ మ్యాన్ కమిషన్ నివేదిక త్వరలోనే రాబోతోందని భావిస్తున్నాం. ఎట్టిపరిస్థితుల్లో మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని నిరుద్యోగ యువతీ,యువకులకు ఈ సభ సాక్షిగా హామీ ఇస్తున్నా. ప్రతిపక్ష పార్టీ నేతలు నా శాఖకు సంబంధించి ప్రశ్నలు వేసి.. చర్చించేందుకు సిద్ధంగా లేరని, ఇది చాలా బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని అన్నారు.

తల్లికి వందనం పథకంపై త్వరలోనే గైడ్ లైన్స్

కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలుచేయనుందని, ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ ను త్వరలోనే ప్రకటిస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. తల్లికి వందనం పథకంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. తల్లికి వందనం పథకానికి బడ్జెట్ లో రూ.9,407 కోట్లు కేటాయించినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. 

****

Comments

-Advertisement-