AP SSC: పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల.. ఇలా ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోండి
AP SSC: పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల.. ఇలా ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోండి
• మన మిత్ర, వాట్సాప్ సేవ 9552300009 ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి..
• పాఠశాల లాగిన్ ద్వారా అధికారిక bse.ap.gov.in లో హాల్‌టికెట్లు పొందవచ్చు..
ఆంధ్ర ప్రదేశ్ పదో తరగతి పరీక్ష హాల్ టిక్కెట్లు విడుదలయ్యాయి. ఈ నెల 17 నుంచి 31వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా విద్యార్థుల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. హాల్ టిక్కెట్లను వివిధ మార్గాల్లో విద్యార్థులు పొందవచ్చు. విద్యార్థులు తమ పాఠశాలలోకి అధికారిక bse.ap.gov.in లో హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదే విధంగా మన మిత్ర, ప్రభుత్వ వాట్సప్ సేవ 9552300009 ద్వారా హాల్ టికెట్లు పొందేందుకు విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఎక్స్‌లో పోస్ట్ చేసారు. పరీక్ష రాసే విద్యార్థులకు మంత్రి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
వెబ్సైట్ లో ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చంటే?:
విద్యార్థులు ముందుగా https://bse.ap.gov.in/apsschtttfy/RegDefault.aspx ఓపెన్ చెయ్యాలి. అందులో రెగ్యులర్, ప్రైవేట్, OSSC రెగ్యులర్, OSSC ప్రైవేట్, ఒకేషనల్ అనే పలు ఆప్షన్‌లు ఉంటాయి. అందులో మీరు రెగ్యులర్ అయితే దానిని సెలక్ట్ చేసుకుని నిర్ధారించుకోవాలి. తర్వాత మీ జిల్లా పేరు, మీ స్కూల్ పేరు, విద్యార్థీ యొక్క పేరు, పుట్టిన తేదీ వివరాలు ఎంచుకొని డౌన్లోడ్ చేయండి.
వాట్సప్‌లో ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చంటే?:
విద్యార్థులు ముందుగా ప్రభుత్వం ఇచ్చిన 9552300009 నెంబర్‌కి ఫోన్ ద్వారా హాయ్ అని వాట్సప్‌లో మెసేజ్ చేయాలి. తర్వాత సేవను ఎంచుకోండి అని ఒక ఫోన్ లింక్ వస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయగానే అక్కడ కొన్ని సేవల జాబితా కనిపిస్తుంది. అందులో మనకు అవసరమైన విద్య సేవలు అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. తరువాత SSC హాల్ టికెట్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేసిన తరువాత, మీ అప్లికేషన్ నంబర్ లేదా విద్యార్థి గుర్తింపు సంఖ్యను నమోదు చేయాలి. అదే విధంగా పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి. తరువాత దాని కింద మీ స్ట్రీమ్ ను ఎంచుకోండి అనే మరో ఆప్షన్ ఉంటుంది. అందులో రెగ్యులర్, ప్రైవేట్, OSSC రెగ్యులర్, OSSC ప్రైవేట్, ఒకేషనల్ అనే పలు ఆప్షన్‌లు ఉంటాయి. అందులో మీరు రెగ్యులర్ అయితే దానిని సెలక్ట్ చేసుకుని నిర్ధారించుకోవాలి. సంబంధిత వివరాలు సరిగ్గా నమోదు చేస్తే కొద్ది నిమిషాల్లోనే మీ హాల్‌టికెట్ వాట్సప్‌కే వచ్చేస్తుంది. దానిని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది. అంతే ఇలా ఎంతో సింపుల్‌గా మీ ఫోన్‌లోనే వాట్సప్ ద్వారా హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
AP పదో తరగతి పరీక్షల టైం టేబుల్:
మార్చి 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు (AP SSC Exams) జరగనున్నాయి. పరీక్షలను ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు నిర్వహించనున్నారు.