ఇంటర్మీడియేట్ పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్
ఇంటర్మీడియేట్ పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్
👉పరీక్షలకు బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు మరియు సిబ్బందికి పలు సూచనలు.
జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న సందర్భముగా జిల్లా ఎస్పీ ఒంగోలులోని సెయింట్ జేవియర్స్ స్కూల్ పరీక్షా కేంద్రమును స్వయంగా తనిఖీ చేసి, అక్కడి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు మరియు సిబ్బందికి పలు సూచనలు తెలియచేసినారు.
పరీక్షా కేంద్రంలో మొబైల్ ఫోన్ లను అనుమతించరాదని, పరీక్షా కేంద్రాల దగ్గరలో జిరాక్స్ సెంటర్లు, ప్రింటింగ్ సెంటర్లు మూయించాలని, పరీక్షా కేంద్రాల పరిసరాల్లో బయట వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు తిరగకుండా చూడాలని, పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎటువంటి విమర్శలకు తావులేకుండా సమర్ధవంతంగా నిర్వహించడానికి పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అవసరమైన కనీస వసతులు సమకూర్చాలని సంబంధిత అధికారులకు సూచించారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 67 ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, పరీక్షా సమయంలో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, ప్రత్యేక మొబైల్ పెట్రోలింగ్ బృందాలు తిరుగుతూ ఉంటాయని, ప్రశ్నపత్రాల తరలింపు, సమాధాన పత్రాలు డిపాజిట్ చెయ్యడానికి తగిన ఎస్కార్ట్ ను ఏర్పాటు చేయడం జరిగిందిని, పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా జరగడానికి పోలీస్ శాఖ తరఫునుండి అన్ని చర్యలు తీసుకున్నామని తెలియచేసినారు.
పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో అనుమానిత వ్యక్తులు ఉన్నట్లు తెలిస్తే వెంటనే అదుపులోకి తీసుకుంటామని, విద్యా శాఖ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఏ పరీక్షా కేంద్రం వద్దయినా ఎటువంటి చిన్న ఘటన జరిగిన వెంటనే DIAL.112/100 లేదా జిల్లా పోలీస్ వాట్సాప్ 9121102266 కు సమాచారం అందించాలని ఎస్పీ తెలియచేసారు.
జిల్లా ఎస్పీ వెంట ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఒంగోలు వన్ టౌన్ సీఐ నాగరాజు, ఒంగోలు తాలూకా ఎస్సై సందీప్ మరియు సిబ్బంది ఉన్నారు.