పోలీసు సోదరా.. నువ్వు లేని సమాజాన్ని ఊహించగలమా..!!
పోలీసు సోదరా.. నువ్వు లేని సమాజాన్ని ఊహించగలమా..!!
• సరిహద్దుల్లో జవాన్ల కాపాలా.. గ్రామాల్లో పోలీసులు పహారా..
• రక్షకభటులు లేని సమాజం ఊహించలేము..
• రాష్ట్రం కోసం గ్రామం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం.. పోలీస్ శాఖ
• సమాజంలో పోలీసులను గౌరవిద్దాం..
• రాత్రింబవళ్లు ప్రజల యొక్క రక్షణ కోసం పోరాడుతారు..
పీపుల్స్ మోటివేషన్: మనకోసం మన ప్రాణాల కోసం దేశ సరిహద్దుల్లో రాత్రింబవళ్లు కాపలా కాసేవారు జవాన్లు అయితే గ్రామాల్లో మన రక్షణ కోసం శాంతి భద్రతల విషయంలో రాజీ లేకుండా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రేయింబవళ్లు చూసేవారే పోలీసులు సమాజంలో తన విధులను నిర్వహిస్తూ తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటారు. శాంతి భద్రతలను సంరక్షిస్తూ, ప్రజల జీవితాలకు, ఆస్తులకూ రక్షణ కల్పిస్తూ, నేరాలు, విధ్వంసాలూ జరగకుండా కాపాడేందుకు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వ్యవస్థ పోలీసు. శాంతిభద్రతలను కాపాడటం, పౌరులను, వారి ఆస్తులను రక్షించడం, నేరాలను నిరోధించడం, దర్యాప్తు చేయడం, వారి అధికార పరిధిలో చట్టాలు, నిబంధనలను అమలు చేయడం వంటివి పోలీసుల బాధ్యత. వారు స్థానిక, ప్రాంతీయ లేదా జాతీయ పోలీసు బలగాలు వంటి ప్రభుత్వ సంస్థలు లేదా విభాగాల కోసం పని చేస్తారు, పోలీసు అధికారులు సాధారణంగా ఆత్మరక్షణ, తుపాకీలను ఉపయోగించడం, అరెస్టు విధానాలు, ట్రాఫిక్ నియంత్రణ, గుంపు నియంత్రణ, అత్యవసర ప్రతిస్పందన, ప్రథమ చికిత్స వంటి వివిధ నైపుణ్యాలలో శిక్షణ పొందుతారు.టైం కి ఆహారం లేకపోయినప్పటికీ తన భార్య బిడ్డలకు దూరంగా ఉంటూ సమాజం కోసం వారు విధులు నిర్వహిస్తారు అటువంటి శాఖ పోలీస్ శాఖ.. ఒక్కొక్కసారి వారికి ఆహారం లేక పడుకునే రోజులు చాలా ఉన్నాయి. వేరేచోటకు విధి నిర్వహణలో వెళ్లేటప్పుడు తనకు ఇచ్చిన బాధ్యతను నిర్వహిస్తూ ఉండటంలో ఖాళీ సమయం లేక తినకుండానే ఉండిపోతారు. కానీ నిరుత్సాహపడరు ఎందుచేత అంటే తన బాధ్యత అటువంటిది మనోధైర్యంతో పోరాడుతారు.
పోలీస్ స్టేషన్ అనేది ప్రజలతో మమేకమై అనేక సేవలను చేసే వ్యవస్థ పోలీసు వ్యవస్థ. 24 గంటలు ఉద్యోగం ఒక పోలీసు ఉద్యోగం మాత్రమే!! పోలీస్ లేని సమాజం మనం ఊహించలేము. వీరి లేకపోతే నేరాలు పెరిగిపోతాయి గంజాయ్ అమ్మకం నాటు సారా మాఫియా హత్యలు మానభంగాలు ఇంకా అనేక రకాలైన నేరాలు జరుగుతాయి. వీటన్నిటిని అరికట్టే శాఖ ఒక పోలీస్ శాఖ మాత్రమే. గ్రామాల్లో ఎన్నికలు జరిగితే పోలీస్ శాఖ అవసరం విఐపి కి భద్రత పోలీస్ శాఖ అవసరం అదేవిధంగా ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి మంత్రులు ముఖ్యమంత్రులు రాష్ట్రపతి ప్రధాన మంత్రులు అనేకమందికి రక్షణ కల్పించేవారు ఒకే ఒక శాఖ పోలీస్ శాఖ. అంతేకాదు లాక్ డౌన్ విషయంలో వీరు పాత్ర ప్రత్యేకత అని చెప్పవచ్చు. గ్రామాల్లో కొట్లాట జరిగిన సభలు జరిగిన తిరునాళ్లు కర్ఫ్యూ ఇలా అవినీతి జరిగిన ఇలా చెప్పుకుంటే ఆ శాఖ యొక్క సేవలో చెప్పలేనివి. ఒక్కొక్కసారి విధి నిర్వహణలో కొన్ని వేల మంది అమరులైన వారు ఉన్నారు అందుకే పోలీసు వ్యవస్థను గౌరవిద్దాం!!!