ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన పదోతరగతి పరీక్షలు.
ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన పదోతరగతి పరీక్షలు..
తొలిరోజు పరీక్షకు 91.60 శాతం మంది విద్యార్ధుల హాజరు..
పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి..
ఏలూరు,మార్చి 17 (పీపుల్స్ మోటివేషన్):-
జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా పదోతరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు.
సోమవారం నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభమయిన నేపద్యంలో ఏలూరు అశోక్ నగర్ లోని కెపిడిటి పాఠశాల నందు పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ పరీక్షా కేంద్రంలో 192 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సివుండగా 100 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరు అయ్యారన్నారు.
జిల్లా వ్యాప్తంగా సోమవారం నిర్వహించిన తెలుగు పరీక్షకు 25,179 మంది విద్యార్థులకు గాను 23,064 మంది (91.60 %) శాతం విద్యార్థులు హాజరు కాగా 2,115 మంది విద్యార్థులు గైర్హాజరైనారు. పకడ్బందీగా పదోతరగతి పరీక్షలను నిర్వహించాలన్నారు. విద్యార్ధులకు ఏర్పాటు చేసిన త్రాగునీరు, ఇతర వసతులను, వైద్య శిబిరాన్ని పరిశీలించారు.
జిల్లా విద్యాశాఖాధికారి ఎం. వెంకటలక్ష్మమ్మ మాట్లాడుతూ సోమవారం నిర్వహించిన పదోతరగతి తెలుగు పరీక్షలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదని తెలిపారు. పరీక్షా కేంద్రాల తనిఖీలో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్లు54 పరీక్షా కేంద్రాలను, డిస్ట్రిక్ట్ లెవెల్ అబ్జర్వర్ 09 పరీక్షా కేంద్రములు, డిఇఓ 06 పరీక్షా కేంద్రములు, ప్రభుత్వ పరీక్షల సహాయ కమీషనర్ వారు 04 పరీక్షా కేంద్రములను తనిఖీ చేసినట్లు ఆమె తెలిపారు.