పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు
పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు
👉విద్యార్థులు ఎలాంటి సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, పర్సులు మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి తీసుకెళ్లకుండా క్షుణ్ణంగా తనిఖీలు
👉పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా, సాఫీగా జరగడానికి పోలీస్ శాఖ తరఫు నుండి అన్ని కట్టుదిట్టమైన చర్యలు
ప్రకాశం జిల్లా, (పీపుల్స్ మోటివేషన్):-
మార్చి 17 నుండి ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం12.45 గంటల వరకు జరుగుతున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ ఆదేశాల మేరకు జిల్లాలోని పోలీస్ అధికారులు మరియు సిబ్బంది జిల్లాలో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న 183 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు.
పరీక్ష వ్రాసే విద్యార్థులు ఎలాంటి సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, పర్సులు మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రాలలోనికి తీసుకెళ్లకుండా క్షుణ్ణంగా తనిఖీలు (ఫ్రిస్కింగ్) నిర్వహించారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ కేంద్రాల సమీపంలో ఎవరూ గుంపులుగా గుమికూడకుండా మరియు డ్రోన్ లతో నిఘా ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఇన్విజిలేటర్లు మరియు పరీక్షకు కేటాయించిన సిబ్బంది తప్ప ఇతరులు లేకుండా చూస్తున్నారు. పరీక్ష కేంద్రాల్లో మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో పరీక్ష ముగిసేంతవరకు జిరాక్స్/ప్రింటింగ్ సెంటర్లు మూసివేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షలు కొనసాగుతున్నంత సేపు మొబైల్ పెట్రోలింగ్ బృందం నిరంతరం పెట్రోలింగ్ ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. పరీక్షా సమయంలో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూస్తున్నారు. పరీక్ష ముగిసాక ప్రశ్నపత్రాల తరలింపు, సమాధాన పత్రాలు డిపాజిట్ చెయ్యడానికి పటిష్ట ఎస్కార్ట్ ఏర్పాటు చేసారు. ప్రతిరోజు పరీక్ష పూర్తయ్యేవరకు సిబ్బంది అనునిత్యం అప్రమత్తంగా విధులు నిర్వర్తిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా, సాఫీగా జరగడానికి పోలీస్ శాఖ తరఫు నుండి అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.