రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మహిళలు భద్రతకు టీమ్స్, శక్తి యాప్ రక్షణ కవచం

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

మహిళలు భద్రతకు టీమ్స్, శక్తి యాప్ రక్షణ కవచం

ప్రతీ ఒక్క మహిళ ఫోన్లో నిక్షిప్తం చేసుకుని ఆపద సమయంలో పోలీసు వారి తక్షణ సహాయం పొందగలరు 

జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్

Shakti app

శనివారం రోజు ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయం నందు శక్తి టీమ్స్ కాకినాడ జిల్లా ఎస్పీ ప్రారంభించినారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళలు, బాలికలు భద్రత కొరకు శక్తి టీమ్స్, శక్తి యాప్ లను ప్రవేశపెట్టింది. ఈ యాప్ ప్రధానంగా మహిళలపై జరిగే వేధింపులు, అత్యాచారాలు, మరియు ఇతర హింసాత్మక సంఘటనలను నివారించటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కావున కాకినాడ జిల్లాలో ప్రతీ ఒక్క మహిళ, గృహిణిలు విద్యార్థినిలు, బాలికలు మీ యొక్క ఫోన్లు నందు ఈ శక్తి యాప్ ను నిక్షిప్తం చేసుకుని ఆపద సమయంలో పోలీసు వారి తక్షణ సహాయం, సహకారం పొందగలరని కాకినాడ జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ తెలిపారు  కాకినాడ జిల్లాలో 4 బృందాలుగా శక్తి టీమ్స్ పని చేస్తాయని వీటిలో కాకినాడ సబ్ డివిజన్ పరిధిలో-3 ,పెద్దాపురం సబ్ డివిజన్ పరిధిలో -1 పనిచేస్తాయని తెలిపారు. ప్రతి బృందానికి మహిళా సబ్ ఇన్స్పెక్టర్ ఇన్చార్జిగా ఉండి పర్యవేక్షిస్తారని తెలిపారు. స్కూల్స్ , కళాశాలలు విడిచి పెట్టే సమయంలో, మహిళలు,బాలికలు ఉదయం వాకింగ్ సమయంలో మహిళల బాలికలకు భద్రత మరియు రక్షణ కల్పిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో శక్తి యాప్ కు సంబంధించి "శక్తి యాప్" లోగోను ట్రైని ASP కుమారి. సుస్మిత, ట్రైనీ డిఎస్పీ కుమారి జీవన, APPS., జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ కి అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో శక్తి బృందాలకు కేటాయించిన 30 శక్తి పెట్రోలింగ్ వాహనాలను జిల్లా ఎస్పీ జండా ఊపు ప్రారంభించారు. ఈ శక్తి బృందాలు మహిళా మరియు బాలికల రక్షణ మరియు భద్రత విషయంలో అవసరమైతే బాడీవార్న్ కెమెరాస్ ఉపయోగిస్తారని తెలిపారు. ప్రజలు ఎక్కువగా చేరే ప్రాంతాలలో, మహిళలు మరియు బాలికలు రక్షణ మరియు భద్రత కల్పించే విధంగా " డ్రోన్" వినియోగిస్తామని తెలిపారు. ఈ శక్తి బృందాలు మహిళా మరియు బాలికల రక్షణ విషయంలో బాధ్యతలు నిర్వహించే క్రమంలో అవసరమైతే దగ్గరలో గల పోలీస్ స్టేషన్ నందు సహాయం తీసుకోవాలని తెలిపారు. మహిళా మరియు బాలికల ఎక్కువగా చేరే ప్రాంతాలలో మహిళలకు సంబంధించి చట్టాలను, వాళ్లు రక్షణ కొరకు ఏర్పాటు చేయబడిన హెల్ప్ లైన్ నెంబర్లన , డ్రగ్స్, సైబర్ నేరాలు వంటి వాటిపై తెలియపరచి, పిల్లలకు గుడ్ టచ్ -బ్యాడ్ టచ్ వంటి వాటిపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ శక్తి యాప్ మహిళలు బాలికలు వాళ్ల ఫోన్లలో ఎక్కువగా నిక్షిప్తం (డౌన్లోడ్) చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

Kakinada police, Andhra Pradesh police

Kakinada police, Andhra Pradesh police

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ AR శ్రీనివాసరావు, SDPO కాకినాడ మనీష్ దేవరాజ్ పాటిల్, ఐపీఎస్.,, SDPO పెద్దాపురం శ్రీ హరి రాజు, ట్రైనీ ASP కుమారి. సుస్మిత, IPS. ట్రైనీ DSP కుమారి.జీవన, APPS., ఇన్స్పెక్టర్ మహిళా పోలీస్ స్టేషన్ రామచంద్రరావు, కాకినాడ పట్టణ ఇన్స్పెక్టర్లు, మహిళా సబ్ ఇన్స్పెక్టర్లు లలితాదేవి, లక్ష్మీకాంతం, దుర్గాదేవి మరియు మహిళ ASI 's HC's, PC's, HC's మరియు అంగన్వాడీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమము పి.రామచంద్రరావు, ఇన్స్పెక్టర్, మహిళా పోలీస్ స్టేషన్ కాకినాడ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.

Comments

-Advertisement-