రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఆ ముగ్గురి పేర్లు.. ఎమ్మెల్సీ స్థానాలకు ప్రకటించిన టీడీపీ

Andhra pradesh to present budget for 2025-26 Ap budget 2025 26 telugu AP Budget pdf AP Budget Highlights Ap Budget portal Ap Finance Budget Ap Budget
Peoples Motivation

ఆ ముగ్గురి పేర్లు.. ఎమ్మెల్సీ స్థానాలకు ప్రకటించిన టీడీపీ

MLA KOTA MLCs BT NAIDU, BEEDHA RAMACHANDRA, KAVALI GREESHMA

• టీడీపీ ప్రకటించిన 3 ఎమ్మెల్సీ స్థానాలను బలహీన వర్గాలకే కేటాయించింది. 

• వెనకబడిన వర్గాలను ఆది నుంచి ఆదరిస్తున్న టీడీపీ తాజాగా ప్రకటించిన 3 ఎమ్మెల్సీ స్థానాలను కూడా బీసీ, ఎస్సీ వర్గాలకే కేటాయించింది. 

• 5 ఎమ్మెల్సీ స్థానాలకు గాను పొత్తులో భాగంగా రెండు సీట్లు జనసేన, బీజేపీకి కేటాయించగా మిగిలిన 3 సీట్లకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. 

• అందులో రెండు బీసీలకు, ఒకటి ఎస్సీకి టీడీపీ అధిష్టానం కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. 

• మూడు ప్రాంతాల్లోంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసింది. 

• రాయలసీమలోని కర్నూలు జిల్లాకు చెందిన బీసీ సామాజికవర్గ నేత బీటీ నాయుడుకి మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. 

• పార్టీలో మొదటి నుంచీ అంటిపెట్టుకుని ఉన్న బీదా రవిచంద్రకు కూడా పార్టీ ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించింది. 

• యువతను ప్రోత్సహించడం, మహిళలకు ప్రాధాన్యతను ఇచ్చే క్రమంలో ఎస్సీ సామాజికవర్గం నుంచి శ్రీకాకుళానికి చెందిన మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మకు పార్టీ అవకాశం ఇచ్చింది. 

• టీడీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపికైన ముగ్గురు నేతలూ బీసీ, ఎస్సీ వర్గాలకు చెందిన వారిని బట్టి చూస్తే ఆ వర్గాలకు టీడీపీ ఇస్తున్న ప్రాధాన్యత ఏంటనేది మరోసారి స్పష్టమైంది.

Comments

-Advertisement-