రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Champions trophy: ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే?

Icc champions trophy prize money Champions trophy prize money in rupees India vs nz cricket match Champions trophy prize money Details ICC PRIZE MONEY
Peoples Motivation

Champions trophy: ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే?

>> ఛాంపియన్ ట్రోఫీలో విజయం సాధించిన జట్టుకు ఫ్రైజ్ మనీ ఎంత

>> రన్నరప్ కు ఎంత వస్తుంది..

>> ఛాంపియన్స్ ట్రోఫీలో ఐసీసీ మొత్తం ప్రైజ్ మనీని $6.9 మిలియన్లు (సుమారు రూ. 60 కోట్లు)..

>> 2017 కంటే 53 శాతం ఎక్కువ..

2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరుకు సర్వం సిద్ధమైంది. టైటిల్ కోసం భారత్- న్యూజిలాండ్ తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ మార్చి 9 (ఆదివారం) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతోంది. ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఛాంపియన్ ట్రోఫీలో విజయం సాధించిన జట్టుకు ఫ్రైజ్ మనీ ఎంత ఇస్తారు? రన్నరప్ కు ఎంత వస్తుంది? అనే చర్చ ఊపందుకుంది. మరి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు ప్రైజ్ మనీ ఎన్ని కోట్లు ఇస్తారో తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ గెలిచే జట్టు భారీగానే డబ్బు అందుకోనున్నది. ఓడిపోయిన జట్టుపై కూడా కనక వర్షం కురువనున్నది. ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన ప్రైజ్ మనీని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇప్పటికే ప్రకటించింది. ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న జట్టుకు దాదాపు రూ. 19.48 కోట్లు ($ 2.24 మిలియన్లు) లభిస్తున్నాయి. ఫైనల్‌లో ఓడిన జట్టు అంటే రన్నరప్‌గా నిలిచిన జట్టుకు దాదాపు రూ. 9.74 కోట్లు (1.12 మిలియన్ డాలర్లు) అందుబాటులో ఉన్నాయి.

సెమీ-ఫైనల్‌లో ఓడిపోయిన జట్లు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దాదాపు రూ. 4.87 కోట్లు (US$ 5,60,000) అందుకుంటాయి‌. గ్రూప్ దశ నుంచి నిష్క్రమించిన జట్లకు కూడా ప్రైజ్ మనీ లభిస్తుంది. ఐదు, ఆరవ స్థానంలో నిలిచిన జట్లు (ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్) సమాన మొత్తంలో $3,50,000 (సుమారు రూ. 3.04 కోట్లు) అందుకుంటాయి. ఏడవ, ఎనిమిదవ స్థానంలో నిలిచిన జట్లు (పాకిస్తాన్, గృహ) సమాన మొత్తంలో $1,40,000 (సుమారు రూ. 1.22 కోట్లు) ఉన్నాయి. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఐసీసీ మొత్తం ప్రైజ్ మనీని $6.9 మిలియన్లు (సుమారు రూ. 60 కోట్లు) అందిస్తోంది. ఇది 2017 కంటే 53 శాతం ఎక్కువ.

ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీ వివరాలు..

• గెలిచిన జట్టు: $2.24 మిలియన్లు (రూ.19.48 కోట్లు)

• రన్నరప్: $1.24 మిలియన్లు (రూ.9.74 కోట్లు)

• సెమీ-ఫైనలిస్టులు (ఆస్ట్రేలియా & దక్షిణాఫ్రికా): $5,60,000 (రూ. 4.87 కోట్లు)

• ఐదవ-ఆరవ స్థానంలో నిలిచిన జట్టు (ఆఫ్ఘనిస్తాన్ & బంగ్లాదేశ్): $3,50,000 (రూ. 3.04 కోట్లు)

• 7-8వ ర్యాంక్ పొందిన జట్టు (పాకిస్తాన్ & దేశం) $1,40,000 (రూ. 1.22 కోట్లు )

Comments

-Advertisement-