రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

G.O No 77: జీవో నెంబర్.77ను రద్దు చేయాలి..

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Peoples Motivation

G.O No 77: జీవో నెంబర్.77ను రద్దు చేయాలి..

• కామన్ పీజీ సెట్ ను రద్దు చేయాలి..

• యూజీసీ ముసాయిదాను ఉపసంహరించుకోవాలి..

• కేంద్ర,రాష్ట్ర బడ్జెట్ లో ఉన్నత విద్యకు అధిక నిధులు కేటాయించాలి..


కర్నూలు, మార్చి 04 (పీపుల్స్ మోటివేషన్):- కామన్ పీజీ సెట్ ను తక్షణమే రద్దు చేసి, పీజీ ప్రవేశ పరీక్షలను యూనివర్సిటీకి లకే అప్పజెప్పాలని, యూజీసీ ముసాయిదాను తక్షణమే ఉపసంహరించుకోవాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రవేశపెట్టే బడ్జెట్లో ఉన్నత విద్యకు అధిక నిధులు కేటాయించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు డి.సోమన్న, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.శరత్ కుమార్, ఏఐఎస్ఎ జిల్లా కార్యదర్శి ఎస్.నాగార్జున, పిడిఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు రమణ డిమాండ్ చేశారు. మంగళవారం ఐక్య విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో రాయలసీమ యూనివర్సిటీ వీసీ ఆచార్య వెంకట బసవరావు కి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం కామన్ పీజీ సెట్ ను ప్రవేశపెట్టడం ద్వారా యూనివర్సిటీలలో పీజీ ప్రవేశాలు తగ్గిపోయాయని అన్నారు. ఈ విధానం వల్ల అనేకమంది విద్యార్థులు ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కామన్ పీజీ సెట్ ప్రవేశపెట్టడం ద్వారా యూనివర్సిటీలలో వివిధ సబ్జెక్టులలో కేవలం పదిమందిలోపే విద్యార్థులు ఉండడం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా గత ప్రభుత్వం జీవో నెంబర్ 77 తీసుకొచ్చి, అమలు చేసి నిర్దాక్షిణ్యంగా పిధి విద్యార్థులకు స్కాలర్షిప్ లేకుండా చేసిందని అన్నారు. గతంలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో నెంబర్ 77ను రద్దు చేస్తామని పీజీ విద్యార్థులకు ఇచ్చిన హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక ఆ ఉసేత్తడం లేదని విమర్శించారు. యూజీసీ ప్రవేశపెట్టిన ముసాయిదా పూర్తిగా యూనివర్సిటీ లకు వ్యతిరేకంగా ఉందని అన్నారు. నేటి వరకు వేసి నియామకాలను రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉండేవని, కానీ ఇప్పుడు సవరించిన వాటిలో నియామకాల్లో రాష్ట్ర గవర్నర్ లకు అధికాధికారాలను అందిస్తున్నాయని, ఈ ముసాయిదా పూర్తిగా యూనివర్సిటీలో నిర్వీర్యం చేస్తూ ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే బడ్జెట్లో ఉన్నత విద్యకు పూర్తిగా ద్రోహం చేశాయని అన్నారు. మొన్న ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో ఉన్నత విద్యకు కేవలం 2,506 కోట్లు కేటాయించడం జరిగిందని, ఈ నిధులు ఉన్నత విద్యకు ఏమాత్రం సరిపోవని అన్నారు. ఈ సమస్యలపై వీసీ ద్వారా నివేదిక పంపించడం కొరకు వినతి పత్రాన్ని సమర్పించామని, ఇందుకు వీసీ గారు సానుకూలంగా స్పందిస్తూ, ఈ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ద్వారా పంపుతామని తెలిపారని వారు అన్నారు. ఈ వినతి పత్రాన్ని సమర్పించిన వారిలో ఏఐఎస్ఎఫ్ యూనివర్సిటీ నాయకులు ఈశ్వర్, పిడిఎస్ యు నాయకులు అస్లాం , ఐసా నాయకులు పవన్ తదితరులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-