Gold Rates: ఆల్ టైం రికార్డుకు పుత్తడి
Gold rates telugu
gold rates near nandyala, andhra pradesh
today gold rate (22 carat)
1 gram gold rate today
Today gold rate kurnool malabar
Gold rate
By
Mounikadesk
Gold Rates: ఆల్ టైం రికార్డుకు పుత్తడి
అంతర్జాతీయ మార్కెట్లు, ఆర్థిక, భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం వంటివి పసిడి రేటును ప్రభావితం చేస్తుంటాయి. తాజాగా ట్రంప్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు గోల్డ్ ధరను అమాంతం పెంచేలా చేస్తున్నాయి.
Gold Rates: బంగారం ధరలు రోజురోజుకూ చుక్కలు చూపిస్తున్నాయి. పసిడి కొనాలంటేనే ప్రజలు బెంతేలెత్తిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే గోల్డ్ రేటు రికార్డు స్థాయికి చేరుకుని పసిడి ప్రియులకు షాక్ ఇచ్చింది. ఇటీవల జీవిత కాల గరిష్ఠానికి చేరిన బంగారం ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. అయినా గతేడాదితో పోలిస్తే ధర భారీగానే పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లు, ఆర్థిక, భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం వంటివి పసిడి రేటును ప్రభావితం చేస్తుంటాయి. తాజాగా ట్రంప్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు గోల్డ్ ధరను అమాంతం పెంచేలా చేస్తున్నాయి. ట్రంప్ నిర్ణయాలతో అంతర్జాతీయ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి. ఈ భయంతోనే మధుపర్లంతా సురక్షితమైన పెట్టుబడిగా భావించి పసిడిని కొంటున్నారు. ఈ కారణంగానే దానికి డిమాండ్ అమాంతం పెరిగిపోయి, ధరకు రెక్కలొచ్చాయి.కాగా, శనివారం (22-03-2025) https://bullions.co.in/ ప్రకారం.. ఉదయం 06:30 గంటల సమయానికి దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,557 ఉండగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.87,880గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.80,694 కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.88,030గా ఉంది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,823కు చేరుకోగా.. 24 క్యారెట్ల తులం పసిడి రేటు రూ.88,170గా ఉంది.
దేశవ్యాప్తంగా ముఖ్యమైన నగరాల్లో బంగారం (22, 24 క్యారెట్ల) ధరలు ఎలా ఉన్నాయంటే..
- కోల్‌కతా- రూ.80,593, రూ.87,920
- చెన్నై- రూ.80,933, రూ.88,290
- బెంగళూరు- రూ.80,758, రూ.88,100
- పుణె- రూ.రూ.80,694, రూ.88,030
- అహ్మదాబాద్- రూ.80,804, రూ.88,150
- భోపాల్- రూ.80,786, రూ.88,130
- కోయంబత్తూర్- రూ.80,933, రూ.88,290
- పట్నా- రూ.80,648, రూ.87,980
- సూరత్- రూ.80,804, రూ.88,150
వెండి ధరలు ఇలా..
ఇక వెండి విషయానికి వస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రూ.97,720 ఉండగా, ముంబైలో రూ.97,890కు చేరుకుంది. అలాగే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కేజీ వెండి ధర రూ.98,050 వద్ద కొనసాగుతోంది.
బంగారం గురించి ముఖ్యమైన వివరాలు..
బంగారం స్వచ్ఛతను క్యారట్లల్లో కొలుస్తారు. క్యారట్ల వాల్యూ పెరిగే కొద్దీ బంగారం స్వచ్ఛత, ధర పెరుగుతాయి. మేలిమి బంగారాన్ని 24 క్యారట్లుగా (24 carat Gold ) చెబుతారు. అంటే ఇది 99.9 స్వచ్ఛమైన బంగారమన్నమాట. ఇది కాయిన్స్ (Gold Coins), బార్స్, బిస్కెట్ల రూపంలో మాత్రమే దొరుకుతుందినగల తయారీకి 22 క్యారట్ల స్వచ్ఛతతో కూడిన బంగారాన్ని వినియోగిస్తారు. ఇందులో ఇతర లోహాలు కలుపుతారు. బంగారంతో చేయించుకునే ఆభరణాలన్నీ 22 క్యారెట్లు/916 స్వచ్ఛతతో ఉంటాయి. ఈ ధర కోసం మేలిమి బంగారం ధరను 91.6 శాతంతో గుణిస్తే సరిపోతుంద బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ విపణికి అనుగుణంగానే ఉంటాయి. అక్కడ పెరిగితే ఇక్కడా పెరుగుతుంది. తగ్గినా అంతే. మన దేశం బంగారం కోసం దాదాపుగా దిగుమతులపైనే ఆధారపడినందున డాలర్ మారకపు విలువ కూడా దేశీయంగా పుత్తడి ధరలపై ప్రభావం చూపుతుంది. కొన్ని దుకాణాలు, ప్రాంతాల్లో పన్నులు, సుంకాలు ముందుగా కలపకుండా లోహాల ధరలను ప్రకటిస్తుంటాయి. దీనివల్ల ధర తక్కువగా కనపడుతుంది. ఆభరణం నచ్చి, బిల్లు వేయమన్నప్పుడు, పన్నులు/సుంకాలు కలిపితే.. ఏ ప్రాంతంలో అయినా బంగారానికి ఒకటే ధర అవుతుంది. ఆభరణం తయారీ, తరుగు ఛార్జీల్లో మాత్రం ప్రతి దుకాణానికీ తేడా ఉంటుంది. కొంతమంది వ్యాపారులు బిల్లు లేకుండా విక్రయిస్తాం.. అప్పుడు 3 శాతం జీఎస్టి కట్టాల్సిన అవసరం ఉండదని చెబుతుంటారు. అయితే బిల్లు లేకుండా కొంటే కొన్ని చిక్కులు ఎదుర్కోవాలి. బంగారం నాణ్యత సరిగా లేకుంటే భారీగా నష్టపోవాల్సి వస్తుంది. ఆభరణం మరమ్మతులకూ బాధ్యత వహించరు. కాబట్టి బంగారం కొనేటప్పుడు బిల్లు ముఖ్యం.
Comments