Suspend: కోడుమూరు హాస్టల్ వార్డెన్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు
Suspend: కోడుమూరు హాస్టల్ వార్డెన్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు
కర్నూలు, మార్చి 24 (పీపుల్స్ మోటివేషన్):-
ఒక సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో ఒక పదవ తరగతి విద్యార్థి 7 8 తరగతులు చదువుతున్న విద్యార్థులను కొడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం విధినిర్వహణలో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో హాస్టల్ వార్డెన్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
వివరాల్లోకి వెళితే.. కోడుమూరు సాంఘిక సంక్షేమ బాలుర వసతిగృహం సంక్షేమ అధికారి జి.రాముడు ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఉత్తర్వులు జారీ చేశారు. కోడుమూరు సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో 11వ తేదీన హాస్టల్ లో ఉంటున్న పదవ తరగతి విద్యార్థి మహేష్ 7వ తరగతి విద్యార్థి పి. రాజు, 8వ తరగతి విద్యార్థి జె.ఇసాక్ లపై భౌతికంగా దాడికి పాల్పడినట్లు 24 వ తేదీన వాట్సప్ లో వీడియో వైరల్ అయింది.. ఈ ఘటన 11 వ తేదీ జరిగినప్పటికీ పై అధికారుల దృష్టికి తీసుకురాకపోవడంతో పాటు వసతి గృహ నిర్వహణ లో సరైన పర్యవేక్షణ చేయకుండా హ విధి నిర్వహణ లో నిర్లక్ష్యం వహించిన కారణంగా వసతి గృహ సంక్షేమ అధికారి జి.రాముడు ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు.