రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Tenth: తెలంగాణ పదో తరగతి పరీక్షలు హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి

bse.telangana.gov.in 10th Class Hall Ticket 2025 www.bse.telangana.gov.in results bse.telangana.gov.in login tgsscht25 Telangana Tenth hall tickets
Peoples Motivation

Tenth: తెలంగాణ పదో తరగతి పరీక్షలు హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి

• మార్చి 21న ప్రారంభంకానున్న తెలంగాణ టెన్త్ ఎగ్జామ్స్

• ఏప్రిల్ 2వ తేదీ వరకు జరగనున్న పరీక్షలు

• పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు..

• bse.telangana.gov.in వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం

మార్చి 21వ తేదీన తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. 

విద్యార్థులు తమ హాల్ టికెట్లను వెబ్ సైట్ నుంచి కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. శుక్రవారం రోజు నుంచి హాల్ టికెట్లను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచబోతున్నారు. bse.telangana.gov.in లింక్ పై క్లిక్ చేసి... పేరు, పుట్టినరోజు వివరాలను ఎంటర్ చేసి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

తెలంగాణ పదో తరగతి పరీక్షల టైం టేబుల్:

మార్చి 21 – ఫస్ట్‌ లాంగ్వేజ్‌

మార్చి 22 – సెకండ్‌ లాంగ్వేజ్‌

మార్చి 24 – ఇంగ్లీష్‌

మార్చి 26 – మ్యాథ్స్‌

మార్చి 28 – ఫిజిక్స్‌

మార్చి 29 – బయాలజీ

ఏప్రిల్‌ 2 – సోషల్‌ స్టడీస్‌

Comments

-Advertisement-