రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Free Bus: పదో తరగతి విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

bse.ap.gov.in AP SSC Exam Hall Tickets SSC hall ticket download 2025 AP bse.ap.gov.in 10th ap ssc hall tickets 2025 Ap tenth hall tickets download
Peoples Motivation

Free Bus: పదో తరగతి విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

• మార్చి 17 నుంచి ప్రారంభమవుతున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలు..

• ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం..  

పదో తరగతి విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతిస్తూ ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీచేసింది. ఈ నెల 17 నుంచి 31వ తేదీ వరకు 6.49 లక్షల మంది విద్యార్థులు 3 వేల 450 పరీక్ష కేంద్రాలకు హాజరుకానున్నారు.

విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డీనరీ సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అధికారులు వీలు కల్పించారు. కేవలం హాల్‌ టికెట్‌ ఉంటే చాలని స్పష్టం చేశారు. సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారులతో మాట్లాడి, వివిధ మార్గాల్లో విద్యార్థుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం అధికారులను ఆదేశించింది.

వెబ్సైట్ లో ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చంటే..?

విద్యార్థులు ముందుగా   https://bse.ap.gov.in/apsschtttfy/RegDefault.aspx ఓపెన్ చెయ్యాలి. అందులో రెగ్యులర్, ప్రైవేట్, OSSC రెగ్యులర్, OSSC ప్రైవేట్, ఒకేషనల్ అనే పలు ఆప్షన్‌లు ఉంటాయి. అందులో మీరు రెగ్యులర్ అయితే దానిని సెలక్ట్ చేసుకుని నిర్ధారించుకోవాలి. తర్వాత మీ జిల్లా పేరు, మీ స్కూల్ పేరు, విద్యార్థీ యొక్క పేరు, పుట్టిన తేదీ వివరాలు ఎంచుకొని డౌన్లోడ్ చేయండి. 

వాట్సప్‌లో ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చంటే..?

విద్యార్థులు ముందుగా ప్రభుత్వం ఇచ్చిన 9552300009 నెంబర్‌కి ఫోన్ ద్వారా హాయ్ అని వాట్సప్‌లో మెసేజ్ చేయాలి. తర్వాత సేవను ఎంచుకోండి అని ఒక ఫోన్ లింక్ వస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయగానే అక్కడ కొన్ని సేవల జాబితా కనిపిస్తుంది. అందులో మనకు అవసరమైన విద్య సేవలు అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. తరువాత SSC హాల్ టికెట్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేసిన తరువాత, మీ అప్లికేషన్ నంబర్ లేదా విద్యార్థి గుర్తింపు సంఖ్యను నమోదు చేయాలి. అదే విధంగా పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి. తరువాత దాని కింద మీ స్ట్రీమ్ ను ఎంచుకోండి అనే మరో ఆప్షన్ ఉంటుంది.‌ అందులో రెగ్యులర్, ప్రైవేట్, OSSC రెగ్యులర్, OSSC ప్రైవేట్, ఒకేషనల్ అనే పలు ఆప్షన్‌లు ఉంటాయి. అందులో మీరు రెగ్యులర్ అయితే దానిని సెలక్ట్ చేసుకుని నిర్ధారించుకోవాలి. సంబంధిత వివరాలు సరిగ్గా నమోదు చేస్తే కొద్ది నిమిషాల్లోనే మీ హాల్‌టికెట్‌ వాట్సప్‌కే వచ్చేస్తుంది. దానిని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది. అంతే ఇలా ఎంతో సింపుల్‌గా మీ ఫోన్‌లోనే వాట్సప్ ద్వారా హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


పదోతరగతి పరీక్షల టైం టేబుల్ వివరాలు: 

మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు (AP Tenth Class Exams) జరగనున్నాయి. పరీక్షలు ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు నిర్వహించనున్నారు.

• మార్చి 17న- ఫస్ట్ లాంగ్వేజ్

• మార్చి 19న- సెకండ్ లాంగ్వేజ్

• మార్చి 21న- ఇంగ్లిష్

• మార్చి 22న- ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2

• మార్చి 24న- మ్యాథమెటిక్స్

• మార్చి 26న- ఫిజికల్ సైన్స్

• మార్చి 28న- బయోలాజికల్ సైన్స్

• మార్చి 29న- OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2, ఒకేషన్ కోర్స్ (థియరీ)

• మార్చి 31న- సోషల్ స్టడీస్

Comments

-Advertisement-