రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

TTD: తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Peoples Motivation

TTD: తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలకు శ్రీవారి దర్శనం

మార్చి 24 నుండి అమలు..

ఒక లేఖ సిఫార్సుకు 06 మందికి మాత్రమే..

తిరుమల, (పీపుల్స్ మోటివేషన్):-

TTD

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనాన్ని టిటిడి కల్పించనుంది. ఈ విధానం మార్చి 24 నుండి అమల్లోకి రానుంది.

ఇందులో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను ఆది, సోమ, వారాల్లో మాత్రమే స్వీకరించడం జరుగుతుంది. (సోమ, మంగళవారం దర్శనాలకు గాను) అదేవిధంగా రూ. 300 దర్శనాల టిక్కెట్‌లకు సంబంధించి సిఫార్సు లేఖలను బుధ, గురు వారాలలో మాత్రమే స్వీకరించడం జరుగుతుందని (ఏ రోజు కా రోజు దర్శనం) తెలియజేయబడుతుంది. (ఒకరికి ఒక సిఫార్సు లేఖను మాత్రమే 06 మందికి మించకుండా స్వీకరించడం జరుగుతుంది).

ఇప్పటివరకు సోమవారం విఐపి బ్రేక్ దర్శనానికి గాను ఆదివారం ఆంధ్ర ప్రజా ప్రతినిధుల నుండి స్వీకరిస్తున్న సిఫార్సు లేఖలు ఇకపై శనివారం నాడు (ఆదివారం దర్శనం కొరకు) స్వీకరించడం ద్వారా.

తిరుమలలో అందుబాటులో ఉన్న వసతి సౌకర్యాలు, ఇతర భక్తుల దర్శన సమయాలను దృష్టిలో ఉంచుకుని సుదీర్ఘంగా చర్చించిన అన్ని వస్తువుల పరిగణలోకి తీసుకున్న తరువాత టిటిడి ఈ మేరకు నిర్ణయించింది.

ఈ మార్పులను భక్తుల దృష్టిలో ఉంచుకొని టీటీడీకి సహకరించవలసిందిగా కోరడమైనది.

Comments

-Advertisement-