విద్యార్థులకు ప్రగతి కార్డులను 21వ తేదీ నాటికి అందించాలి
విద్యార్థులకు ప్రగతి కార్డులను 21వ తేదీ నాటికి అందించాలి
కర్నూలు, ఏప్రిల్ 17 (పీపుల్స్ మోటివేషన్):-
జిల్లాలోని విద్యార్థులకు మార్కులతో కూడిన ప్రగతి కార్డులను 21వ తేదీ నాటికి అందించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం పాఠశాలల ముగింపుకు సంబంధించి webex ద్వారా సంబంధిత అధికారులతో జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని విద్యార్థులకు మార్కులతో కూడిన ప్రగతి కార్డులను 21వ తేదీ నాటికి అందించి ఆన్లైన్ నమోదు పూర్తి చేయాలన్నారు.. పై తరగతులకు చేర్చే ప్రక్రియ పూర్తిచేసి సోమవారం నాడు కొత్త తరగతుల్లో కూర్చునే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. పాఠశాల ఆవశ్యకత, విద్యా ప్రమాణాల గురించి విద్యార్థులకు తెలియజేయాలని. ఈ ప్రక్రియ ఒకటి నుండి 10వ తరగతి వరకు అన్ని తరగతులవరకు జరిగేలా చూడాలని జేసీ ఆదేశించారు..జిల్లావ్యాప్తంగా 4,21, 632 విద్యార్థులు పై తరగతులకు వెళ్తున్నందున వారందరికీ స్కూలు ప్రత్యేకతల ను తెలియజేయాలన్నారు.. జిల్లా వ్యాప్తంగా 1886 అంగన్వాడి కేంద్రాల నుండి పూర్వ ప్రాథమిక విద్యను పూర్తిచేసుకుని ప్రాథమిక విద్యలోకి చేరుతున్నందున వారందరూ మన పాఠశాలల్లో చేరే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.. రాబోయే మూడు రోజులు అనగా 21, 22, 23 తేదీలలో విద్యార్థులు కొత్త తరగతుల్లోకి మారేలా సంబంధిత అన్నీ స్థాయిలలోని విద్యాశాఖాధికారులు కృషి చేయాలన్నారు.. 21 నుండి అందరికీ డే వైస్ షెడ్యూల్ ఇచ్చి ఉన్నందున షెడ్యూల్ ప్రకారం కార్యాచరణలోకి వెళ్లాలన్నారు..పర్యవేక్షణ నిమిత్తం నియమించిన సెక్టోరియల్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఈ క్రియాశీలక కార్యాచరణ నిమిత్తం జిల్లా,డివిజన్, మండలస్థాయి మానిటరింగ్ కమిటీలు నియమించడం జరిగిందని, ఆయా కమిటీలు విస్తృతంగా పర్యటించి నూటికి నూరు శాతం ఇచ్చిన ఆదేశాలు అమలయ్యేలా, ఆచరణాత్మక కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.శ్యామ్యూల్ పాల్ ,జిల్లా లోని కాన్స్టిట్యూటెన్సీ లెవెల్ ఆఫీసర్స్, మండల్ స్పెషల్.ఆఫీసర్స్ , సిడిపీఓలు, సీఈఓ ZP, కర్నూలు, డిప్యూటీ డిఈఓలు, మండల విద్యాధికారులు క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.