రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

APOBMMS: మైనారిటీ కార్పోరేషన్ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

apobmms.apcfss.in APOBMMS AP SC Corporation loans apply Online OBMMS status BC Corporation loans AP bc corporation a.p. website Loans Apcsf.gov.in
Mounikadesk

APOBMMS: మైనారిటీ కార్పోరేషన్ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

apobmms.apcfss.in APOBMMS AP SC Corporation loans apply Online OBMMS status BC Corporation loans AP bc corporation a.p. website Loans Apcsf.gov.in

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, మైనారిటీ మరియు క్రిస్టియన్ మైనారిటీ కార్పోరేషన్ ద్వారా కర్నూలు మరియు నంద్యాల జిల్లాలలో నివసించే ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు మరియు పార్శీకులకు స్వయం ఉపాధి పథకం కింద ప్రత్యేక అవకాశాలు ప్రకటిస్తుంది. ఈ పథకం క్రింద, మైనారిటీ చెందిన వారికి రూ. 1.00 లక్ష నుండి 8.00 లక్షల వరకు, మరియు క్రైస్తవ మైనారిటీ చెందిన వారికి రూ.1.00 లక్ష నుండి 5.00 లక్షల వరకుదరఖాస్తు చేసుకొని ఎంపిక అయినవారికి 50% సబ్సిడీ మంజూరు చేయబడుతుంది.

దరఖాస్తు ప్రక్రియ:

అర్హత కలిగిన వ్యక్తులు తమ వివరాలను https://apobmms.apcfss.in వెబ్సైట్ ద్వారా 25.05.2025 తేదీకి లోపు నమోదు చేసుకోవాలి. మైనారిటీ వారు: ముస్లింలు (సిక్కులు. బౌద్ధులు, జైనులు, పార్శీకులు) మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ లో - క్రైస్తవులు --బిసి-సి మరియు ఓసీ క్రిస్టియన్ కేటగరీ వారు క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆన్ లైన్ నందు నమోదు చేయాలి.

అర్హత ప్రమాణాలు:

1. దరఖాస్తుదారు ఆంధ్ర ప్రదేశ్ పౌరుడు అయి ఉండాలి. 

2. మైనారిటీ కి(ముస్లిం, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, జైన, పార్శీక) చెందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 

3. గత 5 సంవత్సరాలలో రాష్ట్ర/ కేంద్ర ప్రభుత్వాల నుండి ఏవైనా రాయితీలు లేదా సబ్సిడీలు పొందకూడదు.

4. వయస్సు 21 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలి.

5. ఆదాయ పరిమితి:- గ్రామీణ ప్రాంతాలు: రూ. 1,50,000/- సంవత్సరానికి పట్టణ ప్రాంతాలు:రూ.2,00,000/-సంవత్సరానికి, 

6. మోటార్ క్యాట్ కలిగిఉన్న వారు అనర్హులు.

సమర్పించాల్సిన పత్రాలు:

1. కుల దృవపత్రం:- ముస్లింలకు తహసీల్దారు జారీ చేసిన బిసి-ఈ సర్టిఫికేట్, క్రైస్తవులకు తహసీల్దారు జారీ చేసిన బిసి-సి సర్టిఫికేట్ లేదా టెన్త్ టి.సి. లో "ఇండియన్ క్రిస్టియన్" పేరుతో ఉన్న ధృవపత్రం. ఇతర మైనారిటీ/క్రైస్తవులు ఓసీ సర్టిఫికేట్ లేదా క్రైస్తవులకు బాప్టిజం సర్టిఫికేట్ ఉండవలెను. 

2. ఆధార్ కార్డు (జిరాక్స్ కాపీ),

3. చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ (మోటారు వాహన పథకానికి మాత్రమే).

4. ఆదాయ ధృవీకరణ పత్రం (మీసేవా ద్వారా జారీ చేయబడినది). 

5. బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ కాపీ (ఫోటోతో సహా). 

6. నివాస ధృవపత్రం (ఆధార్/ ఓటర్ ఐడి / రేషన్ కార్డ్), 

7. రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు.

ఇతర వివరాలకు సయ్యద సబీహా పర్వీన్ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్, మైనారిటీ మరియు క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ వారు ఆఫీసు నందు సంప్రదించగలరని ప్రకటనలో తెలియజేశారు. ఫోన్ నెంబర్లు: 9848864449/ 9440822219.

ఆఫీసు చిరునామా: ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్, మైనారిటీ మరియు క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్, కలెక్టర్ ఆఫీసు కర్నూలు.

Comments

-Advertisement-