రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో జిల్లాను ప్రగతి పదంలో నడిపించాలి

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో జిల్లాను ప్రగతి పదంలో నడిపించాలి


అభివృద్ధి సంక్షేమ పధకాల పూర్తిగా అమలు చేయడంలో అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి

వేసవిలో త్రాగునీటి ఎద్దడి ఎదుర్కోవడానికి, పారిశుధ్యం వంటి ప్రధాన సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి: రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారధి

చాట్రాయి:ఏప్రిల్ 29: అధికారులు, ప్రజాప్రతినిధులందరూ కలిసికట్టుగా పనిచేసి మండలాన్ని ప్రగతిపథంలో ముందుకు తీసుకువెళ్లాలని ముఖ్యంగా త్రాగునీటి సమస్యలేకుండా ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర గృహనిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి పేర్కొన్నారు. చాట్రాయి మండల సర్వసభ్య సమావేశం స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో మంగళవారం మంత్రి పార్థసారథి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ మండల 

అభివృద్ధిలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. మండలంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా మండలంలో చేపడుతున్న శ్రీనిధి రుణాలు, డ్వాక్రా సంఘాలకు బ్యాంకు లింకేజి రుణాల పంపిణీ సక్రమంగా అందేలా చూడాలని, ఈ రుణాల ద్వారా మహిళలు స్వయం ఉపాధి పధకాలు ఏర్పాటుచేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ,వృద్ధాప్య, వితంతు పింఛన్ల పంపిణీ పూర్తి వివరాలపై మంత్రి అధికారులను ఆరా తీశారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి పెన్షన్ అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో అమలు జరుగుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పధకాల అమలు తీరును అధికారులు మంత్రికి తెలియజేసారు. వివిధ పధకాల ద్వారా అందిస్తున్న రాయితీలు, పించన్లు, ముద్రాలోన్లు తదితర వివరాలను డిఆర్డ్ఏ అధికారులు, పిఎమ్ఏవై అర్బన్ బిఎల్సి, పిఎమ్ఏవై గ్రామీణ్, ప్రధాన మంత్రి జంజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ తదితర అంశాలనుగృహ నిర్మాణ శాఖాధికారులు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం కింద మండలంలో చేపడుతున్న పనులు, నిధుల వ్యయం వివరాలను ఎన్ఆర్జిఎస్ అధికారులు మండలంలో చేపడుతున్న రోడ్ల పనులపై ఆర్ అండ్ బి అధికారులు, పశువులకు మంచినీటి, పశువుల మేత ఏర్పాటుపై ఆరా తీశారు. వేసవిలో పశువుల త్రాగునీటి సౌకర్యం నిమిత్తం గతంలో కట్టిన మంచినీటి తోట్టెలు నిరుపయోగంగా ఉన్నాయని, వాటిని వినియోగించుకోవడానికి చర్యలు చేపట్టాలన్నారు. కూటమి ప్రభుత్వం పారిశుద్యంపై ఎక్కువ శ్రద్ధ కనబరుస్తుందన్నారు. ఆర్ డబ్ల్యూ ఎస్ శాఖాధికారులతో సమీక్షిస్తూ చేపడుతున్న పనులపై ఆరా తీశారు. బోర్వేల్స్ నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడాలని, ప్రతీ పంచాయతీలో మెటీరియల్ ఉంచడమే కాకుండా పూర్తి స్థాయిలో రికార్డులు నిర్వహించాలన్నారు. పర్యవేక్షణలోపమే ప్రధాన కారణమని తెలిపారు. త్రాగు నీరు, పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మండలంలో ఎక్కడా త్రాగునీటి సమస్య ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాలని, కాలువలు కట్టేసి లోగా మంచినీటి చెరువులు నింపుకోవాలన్నారు. స్మశాన వాటిక నిర్మాణాలపై దృష్టి సారించాలన్నారు. వేసవి దృష్టిలో పెట్టుకొని నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.  

ఎస్.సి. కార్పొరేషన్, సాంఘిక సంక్షేమ శాఖ, వయో వృద్ధుల సంక్షేమ శాఖ, NREDCAP, పౌర సరఫరాలు, వెనుకబడిన తరగతుల సేవా సహకార సంస్థ , వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ మరియు ఎంపవర్ మెంట్ శాఖల ప్రగతి నివేదికలపై సమీక్షించి వాటి అమలు పై అధికారులు చిత్త శుద్దితో పని చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ సెంటర్లలో బాల బాలికలకు బాలామృతం పౌష్టికాహారం సక్రమంగా అందేలా చూడాలని శిశు సంక్షేమాధికారిని మంత్రి ఆదేశించారు.   

కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-