పొగాకును తక్షణమే కొనుగోలు చేయాలి.. పొగాకు వ్యాపారులను ఆదేశించిన వ్యవసాయ శాఖ మంత్రి
పొగాకును తక్షణమే కొనుగోలు చేయాలి.. పొగాకు వ్యాపారులను ఆదేశించిన వ్యవసాయ శాఖ మంత్రి
• విక్రయించిన పొగాకును నాణ్యత ప్రమాణాలు లేవనే సాకుతో తిరస్కరిస్తే కటిన చర్యలు..
• పొగాకు సాగులో 70 శాతం వర్జీనియా పొగాకు ఎఫ్ సి వి రకం ను కొనుగోలు చేస్తున్న ప్రభుత్వ రంగము పొగాకు బోర్డు..
• పొగాకు వ్యాపారులు కొనుగోలు చేయవలసినది కేవలం 30 శాతపు సాగులో వున్న బర్లీ పొగాకు కు మాత్రమే..
మంగళవారం రోజు గుంటూరు లామ్ వద్ద నున్న ఆచార్య ఎన్ జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెం నాయుడు గారి అధ్యక్షతన నల్ల బర్లీ పొగాకు కొనుగోలు విషయమై రైతులు ,రైతు సంఘాల నాయకులు , ప్రజాప్రతినిధులు,పొగాకు వ్యాపారులు , రాష్ట్ర వ్యవసాయ ఉన్నతాధికారులు, పొగాకు బోర్డు ఉన్నతాధికారులులతో సమావేశం నిర్వహించారు. వ్యవసాయ మంత్రి మాట్లాడుతూ ,గత కొన్ని రోజులుగా పొగాకు వ్యాపారులు,నల్ల బర్లీ పొగాకును కొనుగోలు చేయకుండా , తాత్సార్య ము చేస్తు రైతులను తీవ్ర ఇబ్బందులకు ,మనో వేదనకు గురి చేస్తున్నారని ,ఈ అంశం చాలా ఆందోళన కలిగించిందని తెలిపారు .ముఖ్యమంత్రి నల్ల బర్లీ పొగాకును ,వ్యాపారులు ఎటువంటి నాణ్యత ప్రమాణాల షరతులు విధించకుండా తక్షణమే కొనుగోలు చేయాలని ఆదేశించారు అని తెలిపారు .
వీటిపై పొగాకు వ్యాపారులు రాష్ట్రములో ఇప్పుడిప్పుడే ఒక పది శాతం మేర కొనుగోలు ప్రక్రియ మొదలయిందని ,ఇకనుండి మరింత పుంజుకుని 100 శాతం బార్లీ పొగాకును కొనుగోలు చేస్తామని మంత్రి కి తెలియచేశారు .ప్రత్యేక కార్యదర్శి వ్యవసాయ & సహకారం బుడితి రాజశేఖర్, వ్యవసాయ సంచాలకులు డిల్లీ రావు ను ఆదేశిస్తూ రేపటినుండి పొగాకు బోర్డు కార్యాలయంలో కాల్ సెంటర్ ను ప్రారంభించి ,మరింత ప్రచారం చెయ్యాలని, అన్ని పొగాకు వ్యాపారులు,కంపెనీలు తప్పనిసరిగా కొనుగోలు ప్రక్రియ లో పాల్గొనే టట్లు చేయాలని,కంపెనీ వారీగా కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించాలని, నాణ్యత ప్రమాణాలు లేవనే అంశముతో తిరస్కరణ చేయరాదని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలోపొగాకు బోర్డు చైర్మన్ C యశ్వంత్ కుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివ రావు పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ, రైతు నాయకులు జమాలయ్య, కృష్ణయ్య, హరిబాబు, రైతులు ఐటీసీ తదితర 9 పొగాకు కంపెనీలు, వ్యాపారులు పాల్గొన్నారు .