వేసవి సెలవులకు ఉళ్లకు వెళ్లే వారు ముందస్తు జాగ్రత్తలు చేపట్టి చోరీలకు అడ్డుకట్ట వేయండి
వేసవి సెలవులకు ఉళ్లకు వెళ్లే వారు ముందస్తు జాగ్రత్తలు చేపట్టి చోరీలకు అడ్డుకట్ట వేయండి
పోలీసులతో సహకరించి జిల్లా పోలీసుశాఖ చేసే సూచనలు పాటించాలని విజ్ఞప్తి
జిల్లా ఎస్పీ పి.జగదీష్ విజ్ఞప్తి
వేసవి సెలవుల నేపథ్యంలో సొంత ఊళ్లు, ప్రాంతాలకు వెళ్ళే జిల్లా ప్రజలు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు విజ్ఞప్తి చేశారు. అహర్నిశలు కష్టపడి సంపాదించిన సొమ్ము, విలువైన వస్తువులు దొంగలు పాలు కాకుండా కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
దొంగతనాల నియంత్రణ కోసం ప్రజలకు సూచనలు :
ఇళ్ళకు తాళం వేసి సొంత గ్రామాలకు వెళ్లే ప్రజలు లేదా పెళ్లి ముహూర్తాలు, విహార యాత్రలకు వెళ్లేవారు ఇళ్ళల్లో విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, డబ్బులు ఉంచి వెళ్లకూడదు
విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో గానీ... లాకర్లు లేని ప్రజలు వాటిని తమకు బాగా తెలిసిన నమ్మకమున్న వారి ఇళ్ళల్లో లేదా బంధువుల ఇళ్ళల్లో భధ్రపరుచుకోవాలి
ఒకవేళ... విలువైన వస్తువులు బ్యాగులు/ సూట్ కేసులలో తమ వెంట తీసికెళ్లాలనుకుంటే ప్రయాణ సమయాలలో బస్సులు, రైళ్లు, ఆటోలు లేదా ఇతర వాహనాలలో వెళ్లేటప్పుడు నిత్యం అప్రమత్తంగా ఉండాలి.
గమ్యస్థానం చేరే వరకు అపరిచితులు, అనుమానితులతో మాటలు కలపడం లేదా వారు ఇచ్చే తినబండారాలు తినడం చేయరాదు. విలువైన ఆభరణాలు కల్గిన బ్యాగులను లగేజీ క్యారియర్ లో ఉంచకుండా దగ్గరగా ఉంచుకోవాలి
సెలవులు ముగించుకుని సొంత ఇళ్లకు చేరే వరకు పాలు, పెరుగు వేసే వారికి మరియు పేపర్ బాయ్ లకు వద్దని చెప్పాలి. ఊళ్లకు వెళ్లే విషయం చెప్పరాదు. ఇంటి బయట చెప్పులు వదలి వెళ్లాలి
ఇంటి బయట/వరండా లేదా ఇంట్లో కనీసం 1 లేదా 2 లైట్లు వేసి వెళ్లాలి. బాగా నమ్మకమున్న ఇరుగు పొరుగు వారిని మీరు ఇంట్లో లేని సమయంలో మీ ఇంటిని గమనిస్తూ ఉండమని చెప్పి వెళ్లాలి.
అపార్టుమెంట్లు, కాంప్లెక్సులు, తదితర వ్యాపార సముదాయాల భద్రతలో భాగంగా సి.సి కెమేరాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు 24/7 సెక్యూరిటీ గార్డులతో ఆయా కాలనీల సంక్షేమ సంఘాలు వేసవి సెలవులు ముగిసే వరకు రాత్రి సమయాల్లో గస్తీని ఏర్పాటు చేసుకోవాలి
వేసవి ఉక్కుపోతను దృష్టిలో ఉంచుకుని ఇంటి బయట, మిద్దెలపై పడుకునే వారు అజాగ్రత్తగా ఉండొద్దండి. కింద ఆభరణాలు ఉంచి డాబాలపై పడుకోకండి
ఇళ్లకు వేయడానికి నాసిరకం తాళాలు వాడకూడదు. తాళం వేసినట్లు కనపడకుండా కర్టెన్స్ వేయాలి. గేటు లోపలి భాగంలో లాక్ చేసి వెళ్లాలి.
అలాగే ఊళ్లకు వెళ్లే విషయం ఎవరికీ చెప్పరాదు. ఇంటిలో పనిమనిషి ప్రతి రోజు కూడా వచ్చి వరండాలో క్లీన్ చేసి వెళ్ళమని చెప్పాలి.
ఊళ్లకు, విహార యాత్రలకు వెళ్లే సమయంలో వాహనాలను పార్క్ చేసి పక్కాగా లాక్ చేసి తాళాలు వెంట తీసికెళ్లాలి... పూలకుండీల్లో, మ్యాట్స్ , తల దిండు మరియు పరుపులు కింద మరియు చెప్పులు స్టాండులో పెట్టి వెళ్లకండి
అలాగే , సొంత ఊర్లకు వెళ్ళే వారు ప్రజలకు పోలీస్ వారు ఇచ్చే ఉచిత సేవను, స్థానిక పోలీస్ వారికి చెప్పి LHMS అనే కెమెరాలను ఉపయోగించుకొని దొంగతనము జరుగకుండా చూసుకోవాలి.ఎలక్ట్రిషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు, గ్యాస్ స్టవ్ రిపేర్ పేరిట అపార్ట్మెంట్ లకు వచ్చే అనుమానిత వ్యక్తులను అనుమతించ కూడదు. కాలనీలలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతూ వుంటే సమీప పోలీస్ స్టేషన్ కు లేదా డయల్ 100/112 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి.