ఈ వ్యర్థాల పునరుత్పత్తితోనే మానవ మనగడ
ఈ వ్యర్థాల పునరుత్పత్తితోనే మానవ మనగడ
• ప్రతి ఉమ్మడి జిల్లాలో ఈ-వేస్టేజ్ ప్లాంట్‌ల ఏర్పాటుకు చర్యలు
• ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా 2047 విజన్ ప్రణాళికలు
• ఈ-చెక్‌కి ప్రజల భాగస్వామ్యం కీలకం
స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో మంత్రి టి.జి. భరత్.
కర్నూలు, ఏప్రిల్ 19 (పీపుల్స్ మోటివేషన్):- ప్రతి ఉమ్మడి జిల్లాలో ఈ-వేస్టేజ్ ప్లాంట్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోబోతున్నామని మంత్రి టి.జి. భరత్ పేర్కొన్నారు.ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ఎలక్ట్రిక్ వస్తువుల ఆవశ్యకత కీలకంగా మారిందని, అయితే అవి మానవ మనుగడకు, పర్యావరణానికి అంతే హాని చేకూర్చిస్తాయని, వాటిని పునరుత్పత్తి ద్వారా పునర్వినియోగం చేసుకుంటునే మానవ మునగడ సాధ్యమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టి.జి. భరత్ అన్నారు.
శనివారం స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ-చెక్ (ఎలక్ట్రిక్ వ్యర్ధాలు పునర్వినియోగం) అంశంపై కమిషనర్ యస్.రవీంద్ర బాబు అధ్వర్యంలో స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక కౌన్సిల్ హాలులో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలకు మంత్రి టి.జి. భరత్, జాయింట్ కలెక్టర్ బి.నవ్య హాజరయ్యారు.
ముందుగా ఆవరణలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వ్యర్ధాల స్టాల్స్‌ను పరిశీలించి, అనంతరం కౌన్సిల్ హాల్లో పారిశుద్ధ్య తనిఖీదారులు, శానిటేషన్ సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు. ఈ-వేస్టేజ్ పోస్టర్లను ఆవిష్కరించి, హాజరైన సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఈ-వేస్ట్ సేకరణ మొబైల్ వాహనాన్ని ప్రారంభించి, ఈ-చెక్ గ్రీన్ వాక్ ర్యాలీ నిర్వహించారు. అలాగే ఆశోక్ నగర్ కే.సి. కెనాల్ వద్ద పాకేట్ పార్క్ వద్ద మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇటివల అమరావతిలో ఓ కంపెనీ ప్రతినిధులతో రాష్ట్రంలో ప్రతి ఉమ్మడి జిల్లాలో ఈ-వేస్టేజ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు, వాటి ద్వారా ఆదాయం సమకూర్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇవి వచ్చేంత వరకు రెడ్యూస్ రియూజ్ రిసైక్లింగ్ సెంటర్లకు ఈ వ్యర్థాలను ప్రజలు అందించాలని కోరారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, లక్ష్యాలు ప్రతిబింబించేలా విజన్-2047 ప్రణాళికలను ప్రభుత్వం రూపొందించి, పకడ్బందీగా అమలు చేస్తోందన్నారు. ఎలక్ట్రిక్ వ్యర్ధాల మానవాళికి, పర్యావరణానికి ముప్పు కలగనీయకుండా ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని, కార్పొరేటర్లు, అధికారులు, నాయకులు ప్రజల్లో చైతన్యం కలిగించాలని కోరారు. కాలువల్లో, నదుల్లో వ్యర్థాలను వేయడం ద్వారా తిరిగి మానవాళిపైనే ప్రభావం చూపుతాయని, అటువంటి పొరపాట్లు చేయకుండా ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. గత ప్రభుత్వం వేసిన చెత్త మీద పన్నును కూటమి ప్రభుత్వం తొలగించడం జరిగిందని, నగరంలో పారిశుద్ధ్యంపై టార్గెట్లు పెట్టుకుని పని చేస్తున్నామని వెల్లడించారు. నగరంలో వేసవి ఎండ తీవ్రత నుండి విముక్తి పొందేందుకు పచ్చదనం పెంపు, క్రీడా రంగ అభివృద్ధి, తదితర అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు రాబట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని, గత ప్రభుత్వం చేసిన జరిగిన తప్పిదాలను సరిచేసుకుంటూ వీటన్నింటినీ నెరవేర్చేందుకు కృషి చేస్తామని మంత్రి తెలిపారు.
జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, ప్రతి నెల మూడో శనివారం ఒక కొత్త నినాదం అమలులోకి తీసుకొని వస్తుందని, దాన్ని సమాజంలో అమలు పరచవలసిన బాధ్యత మనపై ఉందన్నారు. పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి, ఈ కొత్త జనరేషన్లో మనకు ఎదురైతున్న సమస్యలు ఈ వేస్ట్, కెమికల్స్, ప్లాస్టిక్ , ఇవన్నీ ఎక్కువగా జనరేట్ అవుతున్నాయని, అయితే వీటన్నిటిని ఛాలెంజ్‌గా తీసుకొని. వీటిని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ప్రభుత్వం అన్వేషించి, ప్రతి నెల ఒక నినాదంతో పర్యావరణాన్ని పరిశుభ్రత కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. మార్చి నెలలో సింగిల్ యూస్ ప్లాస్టిక్‌ను ఎలా నివారించుకోవాలి అనే దాని పైన ఏప్రిల్ మాసంలో ఈ వెస్ట్ పైన వాటిని ఏ విధంగా నివారించుకోవాలి అనేది ఈ నెల నినాదం భూమిలో కరిగిపోయేటువంటి వస్తువులు పర్యావరణానికి ఇబ్బంది కలిగించవు, భూమిలో కరిగిపోనటువంటి వస్తువులు ఇబ్బందులు కలిగిస్తాయి కావున వీటిని వాడకము కూడా వీలైనంతవరకు తగ్గించుకోవాలి అని అన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులు మానవాళికి నిత్యం వినియోగ పడుతున్నాయి, వాటిని డిస్పోస్ చేయడంపై కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది అని అన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులు సెల్ఫోన్, కంప్యూటర్స్ ఇవన్నీ మానవుని జీవితంలో ఒక భాగం అయినాయి, వీటి లైఫ్ టైమ్ తర్వాత పర్యావరణానికి హాని కలగకుండా వాటి డిస్పోస్ చేసుకోవాలన్నారు. ఇలాంటి వాటికోసం ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ లలో గ్రామ పంచాయతీలలో ఆర్ఆర్ఆర్ రెడ్యూస్, రియూజ్డ్ , రీసైకిల్ సెంటర్స్ ఏర్పాటు కోవాలని జాయింట్ కలెక్టర్ అన్నారు. ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్లు ఉంటాయి. వాటి యందు కరెంటు బల్బులు, పనికిరానిమొబైల్స్,నిరుపయోగమైనటువంటి కంప్యూటర్స్ వాటన్నిటిని ఆ సెంటర్లలో అందజేయాలన్నారు. ఇలాంటి వాటి పైన ఎస్ హెచ్ జి గ్రూపులకు అవగాహన కొరకు శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆర్ ఆర్ ఆర్ సెంటర్ లకు వచ్చిన వేస్టేజ్ అంత కొన్ని సంస్థ లకు అప్పజెప్పడం జరుగుతుందన్నారు. వారు వాటిని హాని కలగకుండా డిస్పోస్ చేస్తారని అన్నారు. ప్రస్తుతం కార్యాలయాల్లో, గృహాల్లో కూడా ఈ వేస్ట్ జనరేట్ అవుతోంది వాటన్నిటిని కూడా ఈ వేస్ట్ కేంద్రాలకు పంపించాలని వీటి కొరకు ఈ వేస్ట్ సేకరణ మొబైల్ వాహనాలు కూడా ఇంటింటికి తిరుగుతాయని అందరూ సహకరించి ఈ వేస్ట్ ను ఈ వాహనానికి అందించాలని జాయింట్ కలెక్టర్ గారు అన్నారు. ఇవే కాకుండా సాలిడ్ వేస్ట్ సెంటర్లు ఇప్పుడు బాగా రన్ అవుతున్నాయని, ముఖ్యంగా ఇంటిలోని తడి చెత్త పొడి చెత్తను కచ్చితంగా వేరుచేసి వచ్చిన పారిశుధ్య కార్మికులకు అందించినట్లయితే సాలిడ్ వేస్ట్ ప్రాసెస్ చేస్తారని దాని ద్వారా కంపోస్ట్ ఎరువులను తయారు చేసుకొని వాటిని మరలా ఉపయోగించుకోవచ్చు అని జాయింట్ కలెక్టర్ అన్నారు. ఇవన్నీ విజయవంతంగా జరగాలంటే ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛంద - స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై ముందుకు సాగాలని జాయింట్ కలెక్టర్ పిలుపునిచ్చారు.
కమిషనర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర సాధనకు అనేక కార్య్రమాలకు శ్రీకారం చుట్టిందని, అందులో స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం ఒకటన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు గతంలో పని చేసినప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమానికి నాంది పలికారని, తాజాగా ఇప్పుడు స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం శ్రీకారం చుట్టారన్నారు. స్వర్ణాంధ్రకు సాధనకు మొదట రాష్ట్రం స్వచ్ఛతతో ఉండాలనే ఉద్దేశ్యంతో, ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ హితం కోసం ప్రజలందరూ పాటు పడాలని కోరారు. ప్రతి నెల మూడో శనివారం, ఒక అంశంతో ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు శ్రీకారం చుట్టిందన్నారు. వ్యర్థాలను నగరపాలక సంస్థకు అందిస్తేనే, మానవాళి మునుగడ, పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు.
కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ కె.విశ్వేశ్వర్ రెడ్డి, పారిశుద్ధ్య పర్యవేక్షక అధికారి నాగరాజు, ఎంఈలు సత్యనారాయణ, శేషసాయి, టిపిఆర్ఓ వెంకటలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.