రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

కర్నూలు స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అందుబాటులోకి

AP TS news Ap POLITICALnews General News Intresting news Fact news Daily news News updates Latest news Important news Latest Short news Latest updates
Mounikadesk

కర్నూలు స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అందుబాటులోకి

రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేలా పటిష్ఠపరుస్తున్నాం 

రాష్ట్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్

Kurnool Cancer hospital opening

Kurnool Cancer hospital opening

కర్నూలు, ఏప్రిల్ 19 (పీపుల్స్ మోటివేషన్):-

అధునాతనమైన వసతులతో కర్నూలు స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అందుబాటులోకి తెచ్చాం అని రాష్ట్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య,శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. 

శనివారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ఏర్పాటు చేసిన లీనియర్ ఆక్సిలరేటర్, సి.టి.సిములేటర్ యంత్రాలు, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, మెడికల్ అంకాలజీ వార్డు లను రాష్ట్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్ కలిసి ప్రారంభించారు..

ఈ సందర్భంగా కాన్సర్ ఇన్స్టిట్యూట్ లోని అన్ని వార్డులను పరిశీలించి, దాదాపు రెండు గంటల సమయం పైగా రోగులతో ముచ్చటిస్తూ గడిపారు.. కేన్సర్ నివారణ విభాగము , అత్యవసర విభాగం, మెడికల్ ఆంకాలజీ వార్డ్ లను పరిశీలిస్తూ అక్కడే ఉన్న రోగులు తిప్పమ్మ, రాజేశ్వరి, సుప్రియ, చిన్నప్ప, రాజు లతో మాట్లాడుతూ వైద్యం ఏ విధంగా అందుతోంది, డాక్టర్లు బాగానే చూసుకుంటున్నారా, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని రోగులను అడిగి తెలుసుకున్నారు.. అనంతరం సూపర్ స్పెషాలిటీ లోని కార్డియో థోరాసిక్ వ్యాస్కులర్ సర్జరీ వార్డు ను పరిశీలిస్తూ బై పాస్ సర్జరీ చేయించుకున్న వారితో మాట్లాడుతూ వారి ఫీడ్ బ్యాక్ ను మంత్రి తీసుకున్నారు..రోగులు స్పందిస్తూ, డాక్టర్లు వైద్య సేవలు చాలా బాగా అందిస్తున్నారని, సమస్యలు లేవని చెప్పడంతో మంత్రి సంతోషించారు.

అనంతరం విలేకరులతో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో లేని విధంగా కేన్సర్ ఇన్స్టిట్యూట్ లో 28 కోట్ల రూపాయల విలువ గల అత్యాధునిక లీనియర్ ఆక్సిలరేటర్ ను, దాదాపుగా 2 కోట్ల 50 లక్షల రూపాయలు విలువ చేసే అనేక రోగ నిర్ధారణ పరికరాలను కూడా ప్రారంభించామన్నారు..తద్వారా రాష్ట్రంలో అధునాతమైన క్యాన్సర్ చికిత్స కర్నూలు లో అందబోతుందన్నారు.... 

ఇప్పటికే కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్య రంగంలో విశిష్టమైన సేవలు అందిస్తోందన్నారు... సర్జికల్ ఆంకాలజీ, జనరల్ ఆంకాలజీ లలో ఊహకు అందని సర్జరీలను వైద్యులు చేశారన్నారు.. 14 సంవత్సరాల అమ్మాయికి అత్యాధునిక బ్రెయిన్ సర్జరీ చేశారన్నారు.. ఈ విధంగా అత్యాధునిక పద్ధతిలో వైద్యులు అనేక సర్జరీలు చేశారన్నారు..వార్డులను పరిశీలించి రోగులను పరామర్శిస్తున్న సమయంలో వారు వైద్యులు అందిస్తున్న సేవలుపట్ల చాలా సంతృప్తి వ్యక్తం చేశారని మంత్రి పేర్కొన్నారు. వైద్యులు రోగులకు అందిస్తున్న సేవలు చాలా బాగున్నాయని మంత్రి వైద్యులను వైద్య సిబ్బందిని అభినందించారు.. ఇదే విధంగా రోగులకు అందించే వైద్య సేవలను కొనసాగించాలని మంత్రి సూచించారు.. రాష్ట్రంలోనే గర్వించదగ్గ వైద్య సంస్థగా, వైద్య కళాశాలగా కర్నూలు ఆస్పత్రిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు..

సంవత్సరం కిందట సమీక్ష నిర్వహించినప్పుడు వైద్య రంగంలో అనేక కొరతలు కనిపించాయన్నారు.. ప్రధానంగా డాక్టర్ల కొరత ఉండేదని, 40 శాతం డాక్టర్ల కొరత ఉంటే ఇటీవలే రీడిప్లాయిమెంట్ చేయడం జరిగిందన్నారు.. అందులో భాగంగా ఆదోని, ఇతరత్రా ప్రాంతాల నుండి డాక్టర్లను, బోధన సిబ్బందిని కర్నూలుకి తీసుకొని వస్తే కేవలం 6 నుండి 7 శాతం మాత్రమే టీచింగ్ స్టాఫ్ కొరత ఉందన్నారు.. అసిస్టెంట్ ప్రొఫెసర్ లు, కింది స్థాయిలో ఇంకా కొరత ఉందని వాటిని రిక్రూట్మెంట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.. గత ప్రభుత్వం రిక్రూట్మెంట్ జీరో వేకెన్సీ పాలసీ అని చెప్పారు కానీ సిబ్బంది నియామకంలో చాలా కొరత ఉందన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేలా పటిష్టపరిచే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. 

2018 సంవత్సరంలో కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న సమయంలో కేంద్రం నుండి 60 శాతంతో రాష్ట్రం నుండి 40 శాతంతో 120 కోట్ల రూపాయలతో స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మంజూరు అయిందన్నారు... ఐతే కేంద్రం నుండి నిధులు విడుదల అయినప్పటికీ పనులు మొదలు పెట్టకుండా గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కాలయాపన చేశారన్నారు.. రాయలసీమలో చాలామంది పేద ప్రజలు ఉన్నారని, క్యాన్సర్ కేసులు ఏటా పెరుగుతూ పోతున్నాయన్నారు.. 2022 సంవత్సరంలో 73 వేల కొత్త క్యాన్సర్ కేసులు వస్తే అందులో 41 వేల మంది ప్రాణాలు కోల్పోయారన్నారు..అయినా కూడా గత ప్రభుత్వం కేన్సర్ ఇన్స్టిట్యూట్ పై శ్రద్ధ పెట్టలేదన్నారు.అధునాతమైన వైద్య సేవలు అందించడానికి డాక్టర్లు సిద్ధంగా ఉన్నారని, వారికి ఇన్ఫ్రా స్ట్రక్చర్, ఎక్విప్మెంట్, సర్జికల్ ఫెసిలిటీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు..కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పై ప్రత్యేక శ్రద్ధ వహించి సమీక్షలు నిర్వహించుకుని 3 నెలల పాటు ఏమి కొరతలు ఉన్నాయని విషయాలను గుర్తించేందుకుగాను ఒక ఏడిఎమ్ఈ ని నియమించడం జరిగిందన్నారు.. 45 కోట్ల రూపాయలు విలువైన అధునాతమైన పరికరాలకు 3 నెలల్లో సమకూర్చామన్నారు.. అదే విధంగా మౌలిక సదుపాయాలను కూడా కల్పించామన్నారు.. కొంతమంది ప్రత్యేక బోధన సిబ్బంది రావాల్సి ఉందని, వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు.. మార్చి 30 వ తేది నాటికి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మౌలిక సదుపాయాలు పూర్తి చేసుకుని, టెక్నీషియన్లు డాక్టర్లు స్పెషలిస్టులు సూపర్ స్పెషలిస్టులు కూడా అందుబాటులోకి రావాలని లక్ష్యాన్ని పెట్టడం జరిగిందని, కానీ మార్చి 4 వ తేదీకే నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తిచేసి ట్రైల్ బేస్ మీద అనేక రకాలైన సర్జరీలు చేసి ఉచితంగా వైద్య సేవలు అందించారన్నారు.. ఈ విధంగా సేవాభావం అంకితభావం ఉన్న డాక్టర్లు ఉన్నప్పుడు వారిని మోటివేట్ చేసి వారికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ విషయాలను గత ప్రభుత్వం మరిచినప్పటికీ మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్య రంగంపై రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు సమీక్షలు నిర్వహించి వైద్యులకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారన్నారు.. కేంద్ర ప్రభుత్వం నుండి వైద్య రంగానికి సంబంధించి సహాయ సహకారాలు అందుతున్నాయన్నారు.. ప్రత్యేకించి వైద్య రంగానికి 15 వ కమిషన్ కింద నిధులు వస్తున్నాయన్నారు.. ఆయుష్మాన్ భారత్ హెల్త్ మిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద కూడా పెద్ద ఎత్తున నిధులు లభిస్తున్నాయన్నారు. కింది స్థాయి పీహెచ్సీ నుండి కూడా వైద్య సేవలు పటిష్టంగా అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.. క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో కేవలం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన రోగులే కాకుండా కర్ణాటక, తెలంగాణ నుండి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు.ప్రైవేట్ ఆస్పత్రులలో 20 నుండి 25 లక్షల వరకు అందించే వైద్యాన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా అందిస్తున్నారని విషయాన్ని అదేవిధంగా రోగులను వైద్యులు కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్నారని విషయాన్ని ప్రజలలోకి తీసుకొని వెళ్లాల్సిన బాధ్యత మీడియాపై ఉందని మంత్రి సూచించారు.

కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, ఏపీఎంఎస్ఐడి సి చైర్మన్ శ్రీనివాసరావు , జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య,అకడమిక్ డి ఎం ఈ డా.రఘునందన్, జి జి హెచ్ సూపరింటెండెంట్ డా .వెంకటేశ్వర్లు,మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా.చిట్టి నరసమ్మ, కేన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు, వివిధ కార్పొరేషన్ ల చైర్మన్లు, డైరెక్టర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..

Comments

-Advertisement-