పూజారి కాలుతో తన్నితే మోక్షం కలుగుతుందనే వింత ఆచారం
General News telugu latest news telugu intresting news telugu intresting facts
Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
By
Peoples Motivation
పూజారి కాలుతో తన్నితే మోక్షం కలుగుతుందనే వింత ఆచారం
ఓ ఆలయంలో 500 ఏళ్ల నుండి నేటికి కొనసాగుతున్న సంప్రదాయం..
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిన్నహోతూరు గ్రామంలో శ్రీ సిద్ధరామేశ్వరస్వామి ఆలయం ఉంది. ఇక్కడ ప్రతి ఏటా ఏప్రిల్లో ఉత్సవాలను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా వేడుకల చివరి రోజున శివపార్వతులకు కల్యాణం జరిపిస్తారు. అయితే ఆ కార్యక్రమంలో భక్తులు కొన్ని తప్పులు చేశారనే ఆగ్రహంతో వీరభద్ర స్వామి ఆలయ పూజారి రూపంలో ఉత్సవ విగ్రహాలను తలమీద పెట్టుకొని ఆగ్రహంతో నాట్యం చేస్తూ భక్తులను కాలితో తంతారు.
ప్రతి ఏటా ఆచారంగా వచ్చే ఈ సంప్రదాయ ఉత్సవాన్ని ఈసారి కూడా ఘనంగా నిర్వహించారు. పూజారితో తన్నులు తిన్న భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం శ్రీ సిద్ధరామేశ్వరస్వామికి వసంతోత్సవం జరిపించారు. ఇది ముగిసిన వెంటనే గ్రామస్థులు ప్రత్యేకంగా గ్రామంలో ఏర్పాటు చేసుకున్న పెద్ద గుంతల్లో గులాబీ రంగు కలిపిన నీటిని మొక్కుగా సమర్పించారు. ఆ రంగు నీళ్లతో వసంతోత్సవాన్ని సంబంరంగా జరుపుకున్నారు. ఇలా గ్రామమంతా ఒకే రంగును వినియోగించడం ఆనవాయితీగా వస్తోందని గ్రామస్థులు పేర్కొన్నారు. ఈ సంప్రదాయాన్ని చూసేందుకు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి చాలామంది అక్కడికి వస్తుంటారు. మరికొందరు ఆసక్తిగా దీన్ని గురించి తెలుసుకుంటారు.
Comments