Gold Rates: పరుగులు పెడుతున్న బంగారం ధర
Gold Rates: పరుగులు పెడుతున్న బంగారం ధర
• ఒక్కరోజులోనే రూ. 1,650 పెరిగిన పసిడి ధర..
• హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో రూ.97,700 పలికిన పసిడి..
• రూ.1900 పెరిగిన కిలో వెండి ధర..
బంగారం ధర సరికొత్త గరిష్ఠ స్థాయికి చేరుకుంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.98 వేలు దాటింది. ఢిల్లీలో ఒక్కరోజులోనే రూ. 1,650 పెరిగి రూ.98,100 ను తాకింది. సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల పసిడి రూ.97,700 కు చేరుకుంది.
వెండి ధర కూడా భారీగానే పెరిగింది. కిలో వెండి రూ. 1,900 పెరిగి రూ.99,400లకు చేరింది. మంగళవారం కిలో వెండి రూ. 97,500 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 3,318 డాలర్లకు చేరుకుంది. గోల్డ్ మాన్ షాక్ అంచనా ప్రకారం బంగారం ధరలు ఈ ఏడాది చివరి నాటికి రూ. 1.25 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. వాణిజ్య యుద్ధం, ట్రంప్ సుంకాల ప్రభావంతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.
బంగారం గురించి ముఖ్యమైన వివరాలు:
బంగారం స్వచ్ఛతను క్యారట్లల్లో కొలుస్తారు. క్యారట్ల వాల్యూ పెరిగే కొద్దీ బంగారం స్వచ్ఛత, ధర పెరుగుతాయి. మేలిమి బంగారాన్ని 24 క్యారట్లుగా (24 క్యారెట్ గోల్డ్ ) చెబుతారు. అంటే ఇది 99.9 స్వచ్ఛమైన బంగారమన్నమాట. ఇది కైన్స్ (గోల్డ్ కాయిన్స్), బార్స్, బిస్కెట్ల రూపంలో మాత్రమే దొరుకుతుందినగల తయారీకి 22 క్యారట్ల స్వచ్ఛతతో కూడిన బంగారాన్ని వినియోగిస్తారు. ఇందులో ఇతర లోహాలు కలుపుతారు. బంగారంతో చేయించుకునే ఆభరణాలన్నీ 22 క్యారెట్లు/916 స్వచ్ఛతతో ఉంటాయి. ఈ ధర కోసం మేలిమి బంగారం ధరను 91.6 శాతంతో గుణిస్తే సరిపోతుందా బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ విపణికి అనుగుణంగా ఉంటాయి. అక్కడ పెరిగితే ఇక్కడ పెరుగుతుంది. తగ్గినా అంతే. మన దేశం బంగారం కోసం దాదాపుగా దిగుమతులపైనే ఆధారపడినందున డాలర్ మారకపు విలువ కూడా దేశీయంగా పుత్తడి ధరలపై ప్రభావం చూపుతుంది. కొన్ని దుకాణాలు, కలప పన్నులు, సుంకాలు ముందుగా లోహాల ధరలను కలిగి ఉంటాయి. దీనివల్ల ధర తక్కువగా కనపడుతుంది. ఆభరణం నచ్చి, బిల్లు వేయమన్నప్పుడు, పన్నులు/సుంకాలు కలిపితే.. ఏ ప్రాంతంలో అయినా బంగారానికి ఒక్కటే ధర అవుతుంది. ఆభరణం తయారీ, తరుగు ఛార్జీల్లో మాత్రం ప్రతి దుకాణానికీ తేడా ఉంటుంది. కొంతమంది వ్యాపారులు బిల్లు లేకుండా విక్రయిస్తాం.. అప్పుడు 3 శాతం జీఎస్టీ కట్టాల్సిన అవసరం ఉంటుందని చెబుతారు. అయితే బిల్లు లేకుండా కొంటే కొన్ని చిక్కులు ఎదుర్కోవాలి. బంగారం నాణ్యత సరిగా లేకుంటే భారీగా నష్టపోవాల్సి వస్తుంది. ఆభరణం నిర్వహణలకూ బాధ్యత వహించారు. కాబట్టి బంగారం కొనేటప్పుడు బిల్లు ముఖ్యం.