పరీక్షల ఫలితాలు మాత్రమే జీవితం కాదు
పరీక్షల ఫలితాలు మాత్రమే జీవితం కాదు
• విద్యార్థులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు..
• చదివే జీవితం కాదు
• మే నెలలో మరో అవకాశం
తెలంగాణలో నేడు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాలు తమకు అనుకూలంగా రాకపోవడంతో ఏటా విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. చదువే జీవితంకాదని ఆ చిన్నారు లు గ్రహించలేకపోతున్నా రు. తల్లిదండ్రులు కోపగించుకుంటారని ఆవేదన చెందుతున్నారు.
ఆత్మ న్యూనతతో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. అధికార యంత్రాంగం సోషల్ మీడియా వేదికగా ఎంత ప్రచారం కల్పిస్తున్నా చిన్నారుల్లో అవగాహన కలగకపోవడం విచారకరం. పరీక్షల ఫలితాల వేళ తల్లిదండ్రులు సైతం అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నా వారి ఏమర పాటు కారణంగా రెప్ప పాటు కాలంలో చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి.
ప్రస్తుత పోటీ ప్రపచంలో మార్కులు, ర్యాంకుల ఆధారంగానే ప్రతిభను గుర్తిస్తున్నారు. ఈ వ్యవస్థ పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపుతోంది. ఎంత ఖర్చయినా సరే పేరున్న స్కూల్‌లో చేర్పించాలనేది తల్లిదండ్రుల తాపత్రయం.
అందులో బాలల నైపుణ్యాలను వెలికితీసే ఎందురు నిపుణులు ఉన్నారనేది చూడటం లేదు. కళాశాలలో పోటీ, ఒత్తిడి తట్టుకోలేక మార్కుల్లో, గ్రేడ్‌లో తగ్గితే బాలలను నిరాశకు గురి చేస్తున్నారు. అటు కళాశాలలో.. ఇటు ఇంట్లో మందలిస్తుండటంతో పిల్లలు ఆత్మహత్యల వైపు ఆలోచన చేయడం దురదృష్టకరం.
మనోధైర్యమే భవిష్యత్తుకు శ్రీరామరక్ష అని తల్లిదం డ్రులు తెలుసుకోవాలి.ఈ ఏడాది తప్పకుండా ఆత్మహత్యల నివారణకు తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా పరీక్షల ఉత్తీర్ణత సమయంలో ఫెయిల్ ఆయినా విధ్యార్థులు ఆందోళన పడనవసరం లేదని,
మే నెలలో మరో అవకాశం ఉంటుంది సంప్లిమెంటరీ పరీక్షలలో వారికి విజయం వరిస్తుందన్న విషయాన్ని గుర్తించాలి. వీరిపై తల్లిదండ్రులు ఎవ్వరు ఒత్తిడి చేయడం, విసుగు చెందడం చేయకూడదు. మానసిక ఒత్తిడిని జయిం చటం కోసం ఆహారపు అలవాట్లు, క్రమం తప్ప కుండా వ్యాయమం, సరైన నిద్ర సరదాగ స్నేహితులతో గడపటం చేయాలి.
తల్లి దండ్రులు ఎప్పుడు పిల్లల్ని ఇతర పిల్లలతో పోల్చకుండా వారిని తక్కువ భావానికి గురి చేయకుండా ఉండాలి. పిల్లలు ఒత్తిడికి ఏమైనా గురైనట్లు అనిపిస్తే కౌన్సిలింగ్ ఇప్పించాలి.
చదువు, ఫలితాలే జీవితం కాదని అనుత్తీర్ణులైన వారూ ఆ తర్వాత ఉన్నతంగా ఎదిగారని వ్యక్తిత్వ వికాస నిపుణులు ఉమాపతి తెలిపారు. గతేడాది పలువురు తప్పుడు నిర్ణయాలతో తల్లిదండ్రులకు శోకం మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవితం అమూల్యమైందని, ఒక్కసారి కోల్పోతే మళ్లీ రాదన్నారు. నచ్చిన రంగంపై పిల్లలు ఆసక్తి చూపాలని, తద్వారా అద్భుత విజయాలు సొంతమవుతాయని తెలిపారు.