Inter results: ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల పూర్తి సమాచారం
tgbie.cgg.gov.in
INTER RESULTS
Released
TELANGANA INTER RESULTS updates
TG INTER RESULTS
Telangana inter results 2025
TS inter results 2025 news
Inter
By
Peoples Motivation
Inter results: ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల పూర్తి సమాచారం
• ఫలితాలను విడుదల చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క..• ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 66.89 శాతం ఉత్తీర్ణత..• సెకండియర్‌లో 71.37 శాతం ఉత్తీర్ణత..
తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల విడుదలయ్యాయి. ప్రథమ, ద్వితీయ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య హాజరయ్యారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు మరోసారి పరీక్షలు రాయాలని మంత్రి చెప్పారు. విద్యార్థులు తమ ఫలితాలను tgbie.cgg.gov.in , వెబ్‌సైట్‌లలో తెలుసుకోవచ్చు. గత నెల 5 నుంచి 25వ తేదీ వరకు తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జరగ్గా, దాదాపు 9.5 లక్షల మందికి పైగా విద్యార్థులు రాశారు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించారు. విద్యార్థులు tgbie.cgg.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి తమ హాల్‌టికెట్ నంబర్‌ను ఎంటర్ చేసి ఫలితాలు పొందొచ్చు.
ఉత్తీర్ణత శాతం ఇలా:
• ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 65.96 శాతం ఉత్తీర్ణత
• ఇంటర్ రెండో సంవత్సరంలో 71.37 శాతం ఉత్తీర్ణత
• ఇంటర్ ప్రథమ సంవత్సరంలో బాలికల ఉత్తీర్ణత శాతం- 73.83
• ఇంటర్ ప్రథమ సంవత్సరంలో బాలుర ఉత్తీర్ణత శాతం- 57.83
• ఇంటర్ రెండో సంవత్సరంలో బాలికల ఉత్తీర్ణత శాతం- 74.21
• ఇంటర్ రెండో సంవత్సరంలో బాలుర ఉత్తీర్ణత శాతం- 57.31
• సెకండియర్‌లో ములుగు జిల్లాలో అత్యధికంగా 80.12శాతం ఉత్తీర్ణత
• సెకండియర్‌లో అత్యల్పంగా కామారెడ్డి జిల్లాలో 54.93 శాతం ఉత్తీర్ణత
ఇక రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను ఇంటర్‌బోర్డు వెల్లడించింది. ఏప్రిల్ 23 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్‌కు పేపర్‌కు రూ. 100 చొప్పున, రీవెరిఫికేషన్‌కు పేపర్‌కు రూ. 600 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
ఫలితాల కోసం ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ https://results.cgg.gov.in/ లో చూడోచ్చు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి, రిజల్ట్ చూసుకోవచ్చు.
Comments