Jobs: 10వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
Jobs: 10వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
ఇండియన్ ఆర్మీ, ఆర్మీ రిక్రూటింగ్ ఆపీసు గుంటూరు నుండి 2025-26 సంవత్సరానికి గాను అగ్నిపద్ పథకంలో భాగంగా అగ్నివీర్ ఉద్యోగాల ఎంపిక నిమిత్తం అర్హత కలిగిన పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తులు ఆహ్వానించేందుకు గాను నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
అగ్నిపధ్ పథకం లో భాగంగా అగ్నివీర్ (జనరల్ డ్యూటీ), అగ్నివీర్ (టెక్నికల్), అగ్నివీర్ (క్లర్క్ / స్టోర్ కీపర్ టెక్నికల్), అగ్నివీర్ (ట్రేడ్స్ మాన్ - 10th పాస్), అగ్నివీర్ (ట్రేడ్స్ మాన్- 8th పాస్) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
విద్యార్హతలు (Educational qualification):
అగ్నివీర్ (జనరల్ డ్యూటీ): 45 శాతం మార్కులతో పదవ తరగతి ఉత్తీర్ణత సాధించాలి.
అగ్నివీర్ (టెక్నికల్): పిజిక్స్, సైన్స్, మ్యాథ్స్ మరియు ఇంగ్లీష్ సబ్జెక్టు లను కలిగి వున్న 10+2/ ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణత సాధించాలి. సరాసరిగా 50 శాతం మార్యులు & ప్రతీ సబ్జెక్టులో 40 శాతం మార్యులు పొంది వుండాలి. (Or) పిజిక్స్, సైన్స్, మ్నాడ్స్ మరియు ఇంగ్లీష్ సబ్జెక్టు లను కలిగి వున్న 10+2 / ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణత సాధించాలి మరియు NSQF లెవల్ 4 లేదా అంతకి మించిన స్థాయి లో ఒక సంవత్సర కాలం పాటు గల ITI కోర్సు ఉత్తీర్ణత సాధించాలి. (Or) పదవ తరగతి ఉత్తీర్ణత (50 శాతం సరాసరి, ప్రతి సబ్జెక్టు లో 40 శాతం మార్కులు) తో 2 సంవత్సరాల ఐటిఐ/ రెండు లేదా 3 సంవత్సరాల డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి..
అగ్నివీర్ (క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్): ఆర్ట్స్/కామర్స్/ సైన్స్ విభాగాలలో 60 మార్కుల సరాసరి మరియు ప్రతి సబ్జెక్టు లో 50 శాతం మార్కులు లో 10+2 / ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణత. 12వ తరగతి లో 50 శాతం మార్కులతో ఇంగ్లీష్ మరియు మ్యాథ్స్ ఉత్తీర్ణత తప్పనిసరి.
అగ్నివీర్ (ట్రేడ్స్ మెన్ 10th పాస్) పదవ తరగతి ఉత్తీర్ణత సాధించాలి.
అగ్నివీర్ (ట్రేడ్స్ మెన్ 8th పాస్) 8వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి.
దరఖాస్తు విధానం (application process):
అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో మార్చి 12 నుండి ఏప్రిల్ 10వ తారీఖు లోగా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు (application fee):
అభ్యర్థులు 250/- రూపాయల అప్లికేషన్ ఫీజు ను ఆన్లైన్ విధానం ద్వారా చెల్లించాలి.
ఎంపిక విధానం(Selection Process):
అభ్యర్థులను ఆన్లైన్ వ్రాత పరీక్ష (ఫేజ్-1), రిక్రూట్మెంట్ ర్యాలీ (ఫేజ్- 2) నిర్వహణ ద్వారా ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష విధానం (ఫేజ్ -1):
అన్లైన్ విధానం ద్వారా జరుగే ఈ పరీక్ష లో ఒక గంటకు 50 ప్రశ్నలు లేదా రెండు గంటలకు 100 ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ రూపంలో ఇస్తారు. వ్రాత పరీక్ష ఇంగ్లీష్ , హిందీ భాషలలో పాటు తెలుగు లో కూడా నిర్వహిస్తారు.
అగ్నివీర్ (క్లర్క్/స్టోర్ కీపర్) ఉద్యోగాలకు టైపింగ్ పరీక్ష నిర్వహిస్తారు.
రిక్రూట్మెంట్ ర్యాలీ (ఫేజ్ -2):
ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్: ఇందులో భాగంగా 1.6 కిలోమీటర్ల పరుగు, పుల్ అప్స్, జిగ్ జాగ్ బాల్, 9f1 డిచ్ వంటివి క్వాలిఫై అవ్వాలి.
ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ : అభ్యర్థులు తగిన ఎత్తు, బరువు, ఛాతీ వంటి శారీరక సామర్థ్యాన్ని కలిగి వుండాలి.
అడాప్టబిలిటీ టెస్ట్ : అభ్యర్థి ఉద్యోగ పరిస్థితులకు అనువుగా వుండగలడా లేదా అన్న అంశాన్ని ఇందులో పరిశీలిస్తారు.
మెడికల్ ఎగ్జామినేషన్ చివరిగా వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జీతం వివరాలు:
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి
మొదటి సంవత్సరం – 30,000/- రూపాయలు (నెలకు)
రెండవ సంవత్సరం - 33,000/- రూపాయలు (నెలకు)
మూడవ సంవత్సరం – 36,500/- రూపాయలు (నెలకు)
నాల్గవ సంవత్సరం - 40,000/- రూపాయలు (నెలకు) జీతం లభిస్తుంది.
ఇందులో 70 శాతం ఉద్యోగులకు ఇచ్చి, 30 శాతం కార్పస్ ఫండ్ కి జమ చేస్తారు.
ఉద్యోగులు ఎంత అయితే కార్పస్ ఫండ్ కి జమ చేస్తారో అంత అదనపు మొత్తాన్ని భారత ప్రభుత్వం కార్బన్ ఫండ్ కి జమ చేస్తాడు.
ముఖ్యమైన తేదీలు:
• ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ 12/03//2025,
• ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి చివరి తేది: 10/04/2025. (25/04/2025 వరకు పెంపు)
• ఆన్లైన్ వ్రాత పరీక్ష నిర్వహణ' జూన్ 2025 (తాత్కాలికం)