POLYCET 2025: డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం.. పూర్తి వివరాలు
POLYCET 2025: డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం.. పూర్తి వివరాలు
ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET AP) పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం పాలిసెట్ 2025 (Polytechnic Common Entrance Test - POLYCET 2025) షెడ్యూల్ను విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తోంది..
ముఖ్యమైన వివరాలు
అర్హత: ఎస్.ఎస్.సి. లేదా తత్సమాన పరీక్ష నందు ఉత్తీర్ణత మరియు ఎస్.ఎస్.సి. లేదా తత్సమాన పరీక్షకు మార్చి / ఏప్రియల్ 2025లో హాజరుకాబోతున్న విద్యార్థులు అర్హులు.
పరీక్ష విధానం: మొత్తం 120 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు, వాటిలో మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
దరఖాస్తు ఫీజు: ఓసీ/బీసీ అభ్యర్థులకు రూ.400, ఎస్సీ, ఎస్టీలకు రూ. 100గా నిర్ణయించారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సాంకేతిక విద్యాశాఖను ఆదేశిస్తూ ఫిబ్రవరి 21న విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు.
దరఖాస్తులకు చివరి తేదీ: 2025 ఏప్రిల్ 15,
పరీక్ష తేదీ: 2025 ఏప్రిల్ 30 (ఆఫ్లైన్ విదాసంలో),
పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్సైట్: http://apsbtet.ap.gov.in ను మరియు ఆన్లైన్ దరఖాస్తు దాఖలుకు https://polycetap.nic.in చూడండి.