POLYCET 2025: పాలిటెక్నిక్ ప్రవేశానికి దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి సమాచారం
POLYCET 2025: పాలిటెక్నిక్ ప్రవేశానికి దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి సమాచారం
2025- 26 విద్యా సంవత్సరానికి పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి అసక్తిగల విద్యార్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ అధికారులు మే 13వ తేదీన పాలిసెట్ పరీక్షను నిర్వహించాలని నిర్ణయించారు. దరఖాస్తుల స్వీకరణ నుండి ఫలితాల వెల్లడి వరకు పూర్తి షెడ్యూల్ ను ఇక్కడ తెలుసుకుందాం..
తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులు, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ, పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ పరిధిలో అందించే డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ పాలిసెట్ (TG POLYCET) 2025 నోటిఫికేషన్ విడుదలైంది..
ముఖ్యమైన సమాచారం
అర్హతలు:
• పదో తరగతి (10వ తరగతి) ఉత్తీర్ణులవ్వాలి.
• 2025లో 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ విధానంలో జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ విడుదల: 18 మార్చి, 2025
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: 19 మార్చి, 2025
ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 19 ఏప్రిల్, 2025
దరఖాస్తు ఫీజు:
• ఇతరులు: రూ. 500
• SC & ST: రూ. 250
అపరాధ రుసుముతో ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ:
• రూ. 100 ఆపరాధ రుసుముతో 21 ఏప్రిల్, 2025
• రూ. 300 అపరాధ రుసుముతో 23 ఏప్రిల్, 2025
పరీక్ష తేది: 13 మే, 2025
ఫలితాల విడుదల: పరీక్ష ముగిసిన 12 రోజుల తర్వాత