రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Supplementary Exam 2025: ఏపీలో టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు అలర్ట్, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ తేదీలు

Mounikadesk

Supplementary Exam 2025: ఏపీలో టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు అలర్ట్, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ తేదీలు

ఏపీలో పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలు (AP 10th Results 2025) వచ్చేశాయి. ఏపీ విద్యాశఆఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా టెన్త్ క్లాస్ ఫలితాలను బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల చేశారు. ఈ ఏడాది 4,98,585 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించారు. 81.14శాతం మంది విద్యార్థులు పాస్ కాగా, ఫెయిల్ అయిన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలపై అప్డేట్ ఇచ్చారు.

సప్లిమెంటరీ ఎగ్జామ్స్ తేదీలు

ఏపీలో మే నెలలో టెన్త్ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. టెన్త్ పరీక్షల్లో ఫెయిల్ అయినవారికి మే 19వ తేదీ నుంచి మే 28 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. టెన్త్ క్లాస్ పరీక్షలలో ఫెయిలయిన విద్యార్థులు బాధ పడొద్దని, ఆందోళన చెందవద్దని సూచించారు. ఈ నాలుగు వారాల సమయాన్ని సద్వినియోగం చేసుకుని సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాలని వారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Comments

-Advertisement-