రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Pak Reaction on Pahalgam Attack: మేం ఏం చేయలేదు, పహల్గాం ఉగ్రదాడికి మోదీ ప్రభుత్వమే కారణం: పాకిస్తాన్

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

Pak Reaction on Pahalgam Attack: మేం ఏం చేయలేదు, పహల్గాం ఉగ్రదాడికి మోదీ ప్రభుత్వమే కారణం: పాకిస్తాన్


జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. అయితే ఇది తమ పనేనని పాక్ కు చెందిన ఉగ్రసంస్థ స్పష్టం చేసింది. లష్కరే తోయిబాకు చెందిన ఒక ఉగ్రవాద శాఖ టెర్రరిస్ట్ రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ఉగ్రదాడి చేసింది తామేనని మంగళవారమే క్లెయిమ్ చేసింది. 

ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజు పాకిస్తాన్ ప్రభుత్వం పహల్గాంమ్ ఘటనపై స్పందించింది. అనంత్ నాగ్ జిల్లాలో జరిగిన ఉగ్రదాడితో మాకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. భారత ప్రభుత్వంపై దేశంలో ఉన్న వ్యతిరేకతే దాడికి పాల్పడేలా చేసి ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేసింది. తమ దేశం అన్ని రకాల ఉగ్రవాదాలను వ్యతిరేకిస్తున్నట్లు పాకిస్తాన్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పష్టం చేశారు. 

పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడితో పాకిస్తాన్‌కు ఎటువంటి సంబంధం లేదని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. నాగాలాండ్ నుండి కాశ్మీర్ వరకు, మణిపూర్‌లో నెలకొన్న అశాంతితో సహా భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో జరుగుతున్నాయి. కనుక ఇది వారి దేశస్తుల పనే.. మాకు ఈ దాడితో ఏ సంబంధం లేదని ఆయన నొక్కి చెప్పారు. దేశంలో అంతర్గతంగా చెలరేగిన చిచ్చు దాడికి కారణమై ఉంటుందని, దీన్ని పాక్ మీద రుద్ది చేతులు దులుపుకునే పని చేస్తున్నారని భారత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

Comments

-Advertisement-