Tenth Results: ఆ రోజే పదోతరగతి పరీక్షల ఫలితాలు
SSC RESULTS ON 23RD
AP TENTH CLASS RESULTS
AP SSC RESULTS DATE
10TH CLASS PUBLIC EXAM RESULTS
AP SSC RESULTS 2025
BSEAP RESULTS.GOV.IN
TENTH RESULTS
By
Peoples Motivation
Tenth Results: ఆ రోజే పదోతరగతి పరీక్షల ఫలితాలు
పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈ నెల 23న విడుదల చేసేందుకు పాఠశాల విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలకు 6,19,275 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఆంగ్ల మాధ్యమానికి సంబంధించి 5,64,064 మంది, తెలుగు మాధ్య మంలో 51,069 మంది పరీక్షలు రాశారు. ఫలితాలను మన మిత్ర వాట్సప్ నంబర్లోనూ విద్యార్థులు పొందొచ్చు.
మన మిత్ర వాట్సప్ ద్వారా ఇలా..
మన మిత్ర వాట్సప్ ద్వారా పదోతరగతి ఫలితాలు తెలుసుకోవచ్చు. మనమిత్ర వాట్సప్ నంబర్ 9552300009కు Hi మెసేజ్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. తద్వారా ఫోన్లోనే రెండే రెండు నిమిషాల్లో రిజల్ట్స్ చూసుకోవచ్చు.
• మనమిత్ర వాట్సప్ నంబర్ 9552300009 కు Hi మెసేజ్ చేయాలి.
• తరువాత మనకు సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ వస్తుంది.
• అందులో మనకు కావలసిన విద్య సేవలు అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
• అందులో పదోతరగతి ఫలితాలు అనే కాలమ్ ఉంటుంది.
• దానిని సెలక్ట్ చేసుకుని, నిర్ధారించండి అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి.
• అనంతరం హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే, ఫలితాలు వస్తాయి.
Comments