High Court: వివాహేతర సంబంధం నేరం కాదు.. ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
Delhi High Court Extramarital Affair IPC Section 497 Adultery Law Justice Neena Bansal Krishna Marital Infidelity Indian Penal Code Supreme Court Judg
By
Peoples Motivation
High Court: వివాహేతర సంబంధం నేరం కాదు.. ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
• ఓ కేసులో ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు..
• భార్య ప్రియుడికి కేసు నుంచి విముక్తి..
• దిగువ కోర్టు తీర్పు కొట్టివేత..
వివాహేతర సంబంధాన్ని నేరంగా చూడాల్సిన అవసరం లేదని, అది నైతికతకు సంబంధించిన అంశమంటూ గతంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ ఓ వ్యక్తి భార్య ప్రియుడికి ఢిల్లీ హైకోర్టు విముక్తి కలిగించింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, ఓ హోటల్‌లో వారిద్దరూ శారీరకంగా దగ్గరయ్యారని మహిళ భర్త ఆరోపిస్తూ కోర్టుకెక్కాడు. ఈ కేసులో మేజిస్ట్రేట్ కోర్టు ప్రియుడిని విడిచిపెట్టేసింది. దీంతో బాధిత భర్త సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు. వాదనలు విన్న కోర్టు ప్రియుడికి సమన్లు పంపింది. దీనిని అతడు ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశాడు. అక్కడ కూడా అతడికి అనుకూలంగానే తీర్పు వచ్చింది.
ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యను భర్త ఆస్తిగా పరిగణించే మహాభారత కాలం నాటి భావజాలానికి కాలం చెల్లిందని పేర్కొంది. వివాహేతర సంబంధం నేరమంటూ ఐపీసీ 497 సెక్షన్ ఇచ్చిన నిర్వచనం రాజ్యాంగబద్ధం కాదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ఉటంకించారు. వివాహేతర సంబంధం నైతికతకు సంబంధించిన అంశమని, దానిని నేరంగా చూడటం సరికాదని స్పష్టం చేస్తూ భార్య ప్రియుడికి ఈ కేసు నుంచి విముక్తి కల్పించారు.
Comments