TG EAPCET 2025: ఈఏపీసెట్ హాల్‌టికెట్ విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి
TG EAPCET 2025: ఈఏపీసెట్ హాల్‌టికెట్ విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి
తెలంగాణ EAMCET 2025 హాల్ టికెట్లు అధికారిక వెబ్‌సైట్లో అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులు లాగిన్ పేజీలో వారి రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ, ఇతర వివరాలను ఉపయోగించి వారి హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ లింక్, అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలు తదితర పూర్తి వివరాలు వారి కోసం..
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG EAPCET) ఏప్రిల్ 29, 30 తేదీల్లో జరగనుంది. ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్ష మే 2 నుంచి 5 వరకూ నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ TG EAPCET హాల్ టికెట్‌తో పాటు చెల్లుబాటు అయ్యే ఫోటో ID ప్రూఫ్‌ను పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలి.
TG EAMCET 2025 హాల్ టికెట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
• అధికారిక వెబ్‌సైట్ eapcet.tgche.ac.in ని సందర్శించండి.
• 'TG EAMCET 2025 hall ticket' లింక్‌పై క్లిక్ చేయండి.
• లాగిన్ పేజీకి వెళ్లి వివరాలు నమోదు చేయండి.
• TG EAMCET 2025 హాల్ టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
• భవిష్యత్తు అవసరాల కోసం TG EAPCET 2025 హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసి సేవ్ చేసుకోండి.
పరీక్షా కేంద్రంలోకి అనుమతి లేని వస్తువులు
• పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ వస్తువులను తమతో తీసుకెళ్లకూడదు. అధికారిక TS EAMCET 2025 మార్గదర్శకాలలో పేర్కొన్న నిషేధిత వస్తువుల జాబితాను కచ్చితంగా పాటించాలి. అవేంటంటే..
• మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, కాలిక్యులేటర్లు, పేజర్లు లేదా ఏవైనా ఇతర ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్‌లు.
• పుస్తకాలు, నోట్స్, లాగ్ టేబుల్స్ , ముద్రించిన విడి కాగితాలు లేదా రాసిన కాగితాలు.
• చెవిపోగులు, గాజులు, ఉంగరాలు, బ్రాస్‌లెట్లు, గొలుసులు వంటి ఆభరణాలు, ఉపకరణాలు.
• గడియారాలు, పర్సులు, హ్యాండ్‌బ్యాగులు లేదా ఏ రకమైన బ్యాగ్ వంటి వ్యక్తిగత వస్తువులకు అనుమతి లేదు.
డ్రెస్ కోడ్
పరీక్షకు సంబంధించిన డ్రెస్ కోడ్‌ను పరీక్షా అధికారులు పేర్కొనలేదు. అయితే, అభ్యర్థులు ఫుల్-స్లీవ్ దుస్తులు, టోపీలు లేదా తలను కప్పి ఉంచే దుస్తులు, సాక్స్ వంటివి ధరించకుండా వెళ్లటం మంచిది.
పరీక్షా కేంద్రంలోకి తీసుకెళ్లాల్సిన వస్తువులు
TG EAMCET 2025 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్షా కేంద్రంలోకి ఈ క్రింది వస్తువులను తీసుకెళ్లాలి. TG EAMCET 2025 అడ్మిట్ కార్డ్ తో పాటు చెల్లుబాటు అయ్యే ఫోటో ID ప్రూఫ్ ఉండాలి. వాటర్ బాటిల్, పెన్ను, పెన్సిల్ మొదలైనవి సామగ్రి తప్పక వెంట తీసుకెళ్లాలి.
అమలులో ఒక్క నిమిషం నిబంధన:
ఉదయం సెషన్ 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మధ్యాహ్నం సెషన్ 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటాయి. అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలకు హాల్ టికెట్లు ఏప్రిల్ 19 నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇంజినీరింగ్ పరీక్షలు మే 2 నుండి 4 వ తేదీ వరకు నిర్వహంచనున్నారు. ఇంజినీరింగ్ పరీక్షలకు ఈ నెల 22 నుండి హాల్ టికెట్ల డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉదయం సెషన్ 7 గంటల 30 నిమిషాల నుండి , మధ్యాహ్నం సెషన్ 1 గంట 30 నిమిషాల వరకు ఉంటుంది.
ఎంట్రెన్స్ పరీక్షల సమయంలో ఒక్క నిమిషం నిబంధన అమలు లో ఉంటుందని JNTU డైరెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉండదని తెలిపారు. ఇప్పటివరకు ఇంజినీరింగ్ కోసం 2 లక్షల 19 వేల 420 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా అగ్రికల్చర్, ఫార్మసీకి 86 వేల 101 మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండు కలిపి 2 లక్షల 53 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.
16 జోన్లుగా పరీక్షా కేంద్రాలు:
తెలంగాణ వ్యాప్తంగా పరీక్షా కేంద్రాలను 16 జోన్లుగా విభజించారు. అగ్రికల్చర్ & ఫార్మసీ పరీక్షల కోసం మొత్తం 112 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇంజినీరింగ్ పరీక్షల కొరకు మొత్తం 124 సెంటర్ల ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా JNTU డైరెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. ఇప్పటికే సెంటర్లను పర్యవేక్షించామని, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు సజావుగా నిర్వహించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.