TG Tenth Results: నేడే టెన్త్ రిజల్ట్స్.. ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
TG Tenth Results: నేడే టెన్త్ రిజల్ట్స్.. ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
TG Tenth Results: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ సారి కొత్తగా మార్కులతో పాటు సబ్జెక్టుల వారీగా గ్రేడ్స్ ప్రకటించనున్నారు.
లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న పదో తరగతి పరీక్షల ఫలితాల ఈ రోజు (బుధవారం)విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ఒంటి గంటకు రవీంద్ర భారతిలో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వరకు రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు జరగ్గా దాదాపు 5లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కావడం, మార్కుల మెమోలను ఎలా ఇవ్వాలన్న అంశంపై పూర్తిస్థాయిలో క్లారిటీ రావడంతో అధికారులు ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను https://bse.telangana.gov.in లో ఒక్క క్లిక్‌తోనే పొందొచ్చు.
ఇక నుంచి పదో తరగతి మెమోల్లో సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నారు. జీపీఏ అనేది తీసివేయనున్నారు. మార్కుల మెమోలపై సబ్జెక్టులవారీగా రాత పరీక్షలు, ఇంటర్నల్ పరీక్షల మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడు పొందుపరచనున్నారు. చివరగా విద్యార్థి పాసయ్యారా? ఫెయిల్ అయ్యారా? అనేది వివరంగా ఇస్తారు. ఇంకా బోధనేతర కార్యక్రమాల(కో కరిక్యులర్ యాక్టివిటీస్)లో స్టూడెంట్స్‌కు గ్రేడ్లు ఇస్తారు. వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ ఎడ్యుకేషన్, వర్క్ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఆర్ట్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అనే నాలుగు కో కరిక్యులర్ యాక్టివిటీస్‌కు సంబంధించిన గ్రేడ్లు కూడా ముద్రిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో పరీక్షలు రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పదో తరగతి పరీక్షల ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్సైట్ bse.telangana.gov.in లేదా results.bse.telangana.gov.in లో మార్కుల వివరాలు తెలుసుకోవచ్చు. విద్యార్ధులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేస్తే.. ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.