రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

సామాన్యుడికి న్యాయం జరిగేలా చూడాలి

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

సామాన్యుడికి న్యాయం జరిగేలా చూడాలి

క్రికెట్ బెట్టింగ్, మట్కా, గ్యాంబ్లింగ్ జరగకుండా గట్టి చర్యలు చేపట్టాలి

చెరువులు, నదులు, వాగులు, ఇతర లోతైన ప్రాంతాలలో పర్యాటకులు ప్రమాదాల బారిన పడకుండా తగిన చర్యలు చేపట్టాలి

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేయాలి

నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్.పి  ఇ.జి అశోక్ కుమార్ 

Kadapa police kadapa SP ashok

కడప ఏప్రిల్ 29: పోలీస్ స్టేషన్ కు వచ్చే సామాన్యుల ఫిర్యాదులకు తక్షణం స్పందించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్.పి ఇ.జి అశోక్ కుమార్ పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్.పి  ఇ.జి అశోక్ కుమార్ ఐ.పి.ఎస్  మంగళవారం స్థానిక పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి  మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలైన క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, మట్కా జిల్లాలో ఎక్కడా జరగకుండా కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఎస్.పి  ఇ.జి అశోక్ కుమార్ ఐ.పి.ఎస్  పోలీస్ అధికారులను ఆదేశించారు. వేసవి నేపథ్యంలో పర్యాటకులు సందర్శించే నదులు, చెరువులు, వంకలు, ఇతర నీరు నిల్వ ఉండే కుంటల వద్ద సరదాగా నీటిలో దిగి ప్రమాదాల బారిన పడకుండా ఆయా ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులతో పాటు గస్తీని పెంచాలని ఆదేశించారు. జిల్లాలో రాత్రి 10:30 కల్లా షాపులు మూసివేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కడప నగరం రింగ్ రోడ్, ఊటుకూరు సర్కిల్, సాక్షి సర్కిల్, ఇతర శివారు ప్రాంతాలు, ప్రొద్దుటూరు పట్టణ శివారు ప్రాంతా లపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎలాంటి నేరాలకు తావు లేకుండా నిరంతరం విజిబుల్ పోలీసింగ్ చేయాలన్నారు. ఆకతాయిలు, బహిరంగ మద్యపానంపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్.పి ఆదేశించారు.  

 జిల్లా ను గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాల రహితంగా చేసేందుకు సమష్టిగా కృషి చేయాలన్నారు. గంజాయి రవాణా, విక్రయాలపై దాడులు ముమ్మరం చేయాలని ఆదేశించారు. గంజాయి సేవించే అవకాశం ఉన్న శివారు ప్రాంతాలు, ఇతర ప్రదేశాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా పెంచాలన్నారు.

సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మిస్సింగ్ కేసులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, త్వరితగతిన ఆచూకీ కనుగొని వారి కుటుంబ సభ్యుల కు అప్పగించాలని ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న కేసులపై నిశితంగా సమీక్ష జరిపి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల ఆదేశాలను క్షేత్రస్థాయి సిబ్బందికి తెలియచేయాలన్నారు.

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేయాలని, గతంలో ప్రమాదాలు జరిగిన బ్లాక్ స్పాట్స్, హాట్ స్పాట్స్ ను గుర్తించి ఆయా ప్రాంతాల్లో సి.సి కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. మలుపుల వద్ద అతి వేగం, వేగ నియంత్రణ లేకపోవడం వల్ల అధికంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని తగిన చర్యలు చేపట్టి ప్రమాదాలను అరికట్టాలని జిల్లా ఎస్.పి గారు ఆదేశించారు. విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ధాబాలు, హోటళ్లు, లాడ్జిలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్ లలో తనిఖీలు నిర్వహించాలన్నారు. పెట్రోలింగ్ ముమ్మరంగా చేయాలని, విద్యాసంస్థల వద్ద ఈవ్ టీజింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిరంతరం నిఘా ఉంచాలన్నారు. జిల్లాలో సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా గ్రామాలూ, పట్టణాల్లోని కాలనీలను సందర్శిస్తూ ప్రజలతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. దొంగతనాలు, ఇతర నేరాలు జరగకుండా పగలు, రాత్రి గస్తీ ని పెంచాలని ఆదేశించారు. గతంలో చోరీ కేసుల్లో సొత్తు త్వరితగతిన రికవరీ చేయాలన్నారు. పాత నేరస్థుల కదలికలపై నిఘా ఉంచాలని, మరోమారు నేరాలకు పాల్పడకుండా చూడాలని తెలిపారు. ఎస్.సి., ఎస్.టి అట్రాసిటీ కేసుల విచారణ పురోగతిని సమీక్షించారు. పూర్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.ఎస్ మూర్తి చట్టాలపై పోలీస్ అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. సమావేశంలో జిల్లాలోని డి.ఎస్.పి లు, సి.ఐ లు పాల్గొన్నారు.

 విధుల్లో ప్రతిభ కనబరచిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందచేసి అభినందించిన జిల్లా ఎస్.పి గారు:

విధి నిర్వహణలో ప్రతిభ కనబరచిన పోలీస్ అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్.పి  ఇ.జి అశోక్ కుమార్ ప్రశంసా పత్రాలు అందచేసి అభినందించారు.

ప్రశంసా పత్రాలు అందుకున్న పోలీస్ అధికారులు, సిబ్బంది వివరాలు:

ఎస్.లింగప్ప, సి.ఐ, జమ్మలమడుగు అర్బన్

ఎస్.కె చాంద్ బాషా, సి.ఐ, పులివెందుల అర్బన్

ఎస్.శ్రీనివాసులు, ఎస్.ఐ, ప్రొద్దుటూరు వన్ టౌన్ పి.ఎస్

పి.మొయినుద్దీన్, ఎస్.ఐ, ముద్దనూరు పి.ఎస్

కె.రఘురామి రెడ్డి పి.సి 2117, ప్రొద్దుటూరు వన్ టౌన్ పి.ఎస్

ఎస్.రాఘవ రెడ్డి, పి.సి 706, చాపాడు పి.ఎస్

వి.వేణుగోపాల్ రెడ్డి, హెచ్.సి 253, వేముల పి.ఎస్

ఎన్.నూరు సాహెబ్, హెచ్.సి 1179, లింగాల పి.ఎస్

బి.ఎల్లా రెడ్డి, పి.సి 3042, పులివెందుల పి.ఎస్

కె.రామ్ రమేష్, పి.సి 3255, పులివెందుల పి.ఎస్

ఎస్.డి రియాజ్, పి.సి 2906, జమ్మలమడుగు పి.ఎస్

కె.దేవదాసు, హెచ్.సి 1987, జమ్మలమడుగు పి.ఎస్

పి.నాగేంద్ర పి.సి 858, జమ్మలమడుగు పి.ఎస్

ఎస్.కె బాషా, పి.సి 2118, సి.సి.ఎస్, కడప

పి.సుదర్శన్ రెడ్డి పి.సి 2838 , సి.సి.ఎస్, కడప

సి.రమేష్, హెచ్.సి 105, ముద్దనూరు పి.ఎస్

ఎన్.గురుమోహన్, పి.సి 3455, ముద్దనూరు పి.ఎస్


Comments

-Advertisement-