యోగాంధ్ర -2025 క్యాంపెయిన్ పై ప్రజల్లో అవగాహన కల్పిస్తాం
యోగాంధ్ర -2025 క్యాంపెయిన్ పై ప్రజల్లో అవగాహన కల్పిస్తాం
కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
అనంతపురం, మే 19 :
యోగాంధ్ర -2025 క్యాంపెయిన్ పై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు.సోమవారం సాయంత్రం రాష్ట్ర సచివాలయం నుండి.స్టేట్ ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్,యోగాంధ్ర -2025 క్యాంపెయిన్, ప్రభుత్వ పథకాలు, సేవలపై ప్రజా స్పందనలు,జిల్లా సబ్ ఆర్డినేట్ కోర్టులలో టాయిలెట్స్ కాంప్లెక్స్ వంటి వివిధ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించి తగు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
సీఎస్ విసి లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, తాడిపత్రిలోని బుగ్గ రామలింగేశ్వర ఆలయం గుత్తి కోట లాంటి చారిత్రాత్మక ప్రదేశాల్లో యోగాంధ్ర 2025లో భాగంగా కార్యక్రమాలను చేపడతామని జిల్లా కలెక్టర్ సి ఎస్ కు వివరించారు ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ ఏ.మాలోల,కలెక్టరేట్ ఏఓ అలెగ్జాండర్, మున్సిపల్ కమిషనర్ బాలస్వామి,డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.