రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మంత్రి సత్యకుమార్ యాదవ్ విజన్‌కు కేంద్ర మద్దతు

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

మంత్రి సత్యకుమార్ యాదవ్ విజన్‌కు కేంద్ర మద్దత

  • ధర్మవరం హస్తకళల అభివృద్ధికి మరో ముందడుగు
  • కేంద్ర జౌళి శాఖ స్పందన

  • ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ చొరవతో హస్తకళల అభివృద్ధికి మార్గం సుగమం
  • కేంద్రం నుండి ధర్మవరం ప్రాజెక్ట్‌కు పచ్చజెండా

ధర్మవరం మే 19 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ గారు ధర్మవరం నియోజకవర్గం అభివృద్ధికి తీసుకుంటున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఇటీవల ఆయన కేంద్ర జౌళి శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ గారికి రాసిన లేఖకు తగిన స్పందన లభించింది. సత్య కుమార్ యాదవ్ గారు 30 ఏప్రిల్ 2025న కేంద్ర మంత్రికి లేఖ రాసి, ధర్మవరం లో ముడి పదార్థాల డిపో ఏర్పాటు కోసం Infrastructure and Technology Support Scheme for Handicraft Sector కింద ఆమోదం కోరారు. దీనికి స్పందనగా, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ గారు 13 మే 2025న అధికారికంగా ఉత్తరం రాసి, ఆ లేఖను సంబంధిత విభాగానికి అవసరమైన చర్యలు తీసుకునే విధంగా ఫార్వార్డ్ చేసినట్లు తెలిపారు. ఈ చర్య ద్వారా ధర్మవరం హస్తకళల రంగానికి విశేషంగా మేలు జరగనుంది. ఈ ప్రాజెక్ట్ అమలవితే, వేలాది మంది కళాకారులకు నాణ్యమైన ముడి పదార్థాలు తక్కువ ధరకు, సమయానికి అందుబాటులోకి వచ్చి వారి జీవనోపాధికి స్థిరత కలగనుంది. ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ గారు స్పందిస్తూ, ధర్మవరం కళాకారుల సమస్యలను పరిష్కరించే దిశగా కేంద్రంతో పరస్పర సహకారంతో ముందుకు సాగుతున్నాం. ఇది వోకల్ ఫర్ లోకల్ దిశగా ఒక గొప్ప అడుగు అని తెలిపారు.

Comments

-Advertisement-