రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

దర్శనానికి వెళ్లి వస్తు ఆటో బోల్తా.. నలుగురు మృతి

ADONI PEOPLE DIED IN ROAD ACCIDENT 4 PEOPLE DEAD IN ROAD ACCIDENT ROAD ACCIDENT AT ATMAKUR ROAD ACCIDENT TODAY ROAD SAFETY NEWS ROAD ACCIDENT NEWS
Peoples Motivation

దర్శనానికి వెళ్లి వస్తు ఆటో బోల్తా.. నలుగురు మృతి

• శ్రీశైలం దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం..

• మృతులు ఆదోనివాసులుగా గుర్తింపు..

ADONI PEOPLE DIED IN ROAD ACCIDENT 4 PEOPLE DEAD IN ROAD ACCIDENT ROAD ACCIDENT AT ATMAKUR ROAD ACCIDENT TODAY ROAD SAFETY NEWS ROAD ACCIDENT NEWS

ఆటో బోల్తా పడి నలుగురు మృతి చెందిన ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఆత్మకూరు మండలం బైర్లూటి సమీపంలో బొలేరో వాహనం బోల్తా పడి ఈ ప్రమాదం జరిగింది. శ్రీశైలం నుంచి దర్శనం చేసుకుని ఆదోనికి వస్తుండగా వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలవ్వగా ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

వీరిలో తీవ్రంగా గాయపడిన ఆరుగురిని మాత్రం కర్నూలు సర్వజన వైద్యశాలకు తరలించారు. బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. ప్రమాదంలో ఆదోనికి చెందిన గిడ్డయ్య (42), శశికళ (40), లక్ష్మీ (28), చంద్రమ్మ (30)లు మృతి చెందినట్లు గుర్తించారు.

మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి మంత్రి టీజీ భరత్ 

నంద్యాల జిల్లా బైర్లూటి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి టీజీ భరత్. శ్రీశైలం దర్శనానికి వెళ్లి వస్తుండగా మృతి చెందడం ఎంతో బాధాకరమన్న మంత్రి టీజీ. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన మంత్రి టీజీ భరత్

Comments

-Advertisement-