రోడ్డు పక్కన ఉన్న ఓ బంకులోకి దూసుకెళ్లిన కారు.. ఆరుగురి మృతి
రోడ్డు పక్కన ఉన్న ఓ బంకులోకి దూసుకెళ్లిన కారు.. ఆరుగురి మృతి
కోవూరు పోతిరెడ్డిపాలెం వద్ద కారు బీభత్సం
రోడ్డు పక్కన ఉన్న ఓ బంకులోకి దూసుకెళ్లిన కారు
ఆరుగురి మృతి, పలువురికి తీవ్ర గాయాలు
బంకులోని రమణయ్య వ్యక్తి సహా 6 మంది మృతి
నారాయణ మెడికల్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు
నరేష్, అభిషేక్, జీవన్, యగ్నేష్, అభిసాయిలుగా గుర్తింపు
బుచ్చిరెడ్డిపాలెం లో ఓ నిశ్చితార్థానికి హాజరై తిరిగి వస్తున్న విద్యార్థులు
కారు అదుపుతప్పి వేగంగా బంకులోకి దూసుకెళ్లిన వైనం
ఘటనా స్థలిని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో చోటు చేసుకుంది. ఈ ఘోర ప్రమాదం కారు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దుసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే పొతిరెడ్డిపాలెం వద్ద ఓ ఇంట్లోకి కారు దూసుకెళ్లడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. ముంబయి జాతీయ రహదారిపై ఉన్న పెట్రోల్ బంకు వద్దకు రాగానే అదుపుతప్పిన కారు ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ ఇంట్లో నివసిస్తున్న వెంకట రమణయ్య (50) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వైద్య విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. బుచ్చిరెడ్డి పాలెంలో స్నేహితుడి అక్క నిశ్చితార్థానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. దీంతో స్థానికులు పోలీసులు, 108 వాహనానికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను నెల్లూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. నెల్లూరులో చికిత్స పొందుతూ ఐదుగురు వైద్య విద్యార్థులు సైతం ప్రాణాలు కోల్పోయారు. మృతులను జీవన్, విఘ్నేష్, నరేశ్, అభిసాయి, అభిషేక్‌గా గుర్తించారు. మరో విద్యార్థి మౌనిత్ రెడ్డి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వీరంతా నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాలలో మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు సమాచారం. ఘటనా స్థలిని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.